Bollywood Actress: సాధారణంగా ఏ కుటుంబంలో అయినా సరే తల్లిదండ్రులు.. ఏ రంగంలో అయితే స్థిరపడతారో వారి పిల్లల్ని కూడా అదే రంగంలో ఉన్నత స్థానానికి చేర్చాలి అని కలలు కంటారు. కానీ మరి కొంతమంది తమ పిల్లల కలలను దృష్టిలో పెట్టుకొని.. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది తండ్రులు దేశానికి సేవలు అందిస్తుంటే.. వారి కూతుర్లు మాత్రం తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని ఇటు సినీ ఇండస్ట్రీలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కూడా.. ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీలు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు మన దేశ సేవలో తండ్రులు అంకితమైతే.. కూతుర్లు మాత్రం ప్రజల్ని అలరించడంలో అంకితమైపోయి బిజీగా మారిపోయారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.
రకుల్ ప్రీత్ సింగ్..
తెలుగు, తమిళ్, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈమె తండ్రి రాజేంద్ర సింగ్. ఈయన ఒక ఆర్మీ ఆఫీసర్గా దేశానికి సేవలు అందిస్తున్నారు. నిజానికి తనకు తన తండ్రి అంటే చాలా భయం అని సందర్భాలలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
అనుష్క శర్మ..
ఒకప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి శాశ్వతంగా దూరమైపోయింది. అటు భర్త , ఇటు పిల్లలను చూసుకుంటూ కెరియర్ ను కొనసాగిస్తున్న అనుష్క శర్మ (Anushka Sharma) తండ్రి కూడా ఆర్మీ అధికారి. ఆయన పేరు కల్నల్ అజయ్ కుమార్. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. ఈమె స్కూలింగ్ మొత్తం బెంగళూరు ఆర్మీ స్కూల్లోనే పూర్తికావడం గమనార్హం.
ప్రియాంక చోప్రా..
బాలీవుడ్ హీరోయిన్ గా మొదట పేరు సొంతం చేసుకొని.. ఆ తర్వాత తన నటనతో నేడు గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ప్రస్తుతం రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29(SSMB 29)అనే సినిమాలో నటిస్తోంది. ఈమె కూడా ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ నుంచే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈమె తండ్రి ఆర్మీలో వైద్యులుగా పనిచేశారు.
లారా దత్తా ..
లారా దత్తా (Lara Dutta).. తన నటనతోనే కాదు అందంతో కూడా ప్రేక్షకులను అలరించి.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తండ్రి ఎల్ కె దత్తా . ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్సులో వింగ్ కమాండర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.
సుస్మితా సేన్..
మాజీ విశ్వసుందరిగా పేరు సొంతం చేసుకున్న సుస్మితా సేన్ తన నటనతో కూడా ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా గుర్తింపు అందుకుంది. ఈమె తండ్రి పేరు శుభీర్ సేన్. ఈయన కూడా వింగ్ కమాండర్ గా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు.
ఇక వీరితోపాటు నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాల తండ్రి కూడా నేవీలో రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది.
ALSO READ: Jr NTR vs Balayya : బాబాయ్ vs అబ్బాయ్.. ఉపేంద్రతో తప్పిన వార్.. ఏమైందంటే?