BigTV English

Deepika Das: గౌరవం ఇవ్వటం నేర్చుకోండి… హీరో యశ్ తల్లికి కౌంటర్ ఇచ్చిన దీపిక!

Deepika Das: గౌరవం ఇవ్వటం నేర్చుకోండి… హీరో యశ్ తల్లికి కౌంటర్ ఇచ్చిన దీపిక!
Advertisement

Deepika Das:  కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న నటుడు యశ్(Yash) కేజిఎఫ్ సినిమా(KGF Movie) ద్వారా పాన్ ఇండియా స్థాయిలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మించడమే కాకుండా హీరోగా కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా హీరో యష్ తల్లి పుష్ప(Pushpa) ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. యశ్ తల్లి పుష్ప నిర్మాతగా మారి కొత్తల వాడి(Kotthalavaadi) అనే చిత్రాన్ని నిర్మించారు అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పుష్ప నటి దీపికా దాస్ (Deepika Das)గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


దీపిక పెద్ద హీరోయిన్ కాదు..

నటి దీపికా దాస్ పెద్ద హీరోయిన్ ఏమీ కాదని ఇండస్ట్రీలో కొనసాగుతూ ఆమె ఇప్పటివరకు ఏం సాధించింది అంటూ తన గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త కన్నడ చిత్ర పరిశ్రమలో వివాదానికి కారణం అయ్యాయి. ఇలా ఒక నటి గురించి పుష్ప ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు సరైంది కాదంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే నటి దీపికా దాస్ ఈ ఘటనపై స్పందిస్తూ.. హీరో తల్లి పుష్పకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి ఎవరైనా కొత్త వాళ్ళని పరిచయం చేయాలనుకునే వారు ముందుగా వారిని గౌరవించడం నేర్చుకోవాలి అంటూ మాట్లాడారు.


చెడుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు…

సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తర్వాత తనకంటూ గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నానే తప్ప, ఎవరి పేర్లను తాను వాడలేదని తెలిపారు. అవతల ఉన్నది అమ్మ అయిన పుష్పమ్మ అయినా నా గురించి చెడుగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు అంటూ ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో తాను మౌనంగా ఉన్నాను అంటే ఇండస్ట్రీలో నేనేమీ సాధించలేదని ,లేదంటే అవతల వారికి భయపడి కాదని స్పష్టం చేశారు. కేవలం వారిపై ఉన్న గౌరవంతోనే మౌనంగా ఉన్నానని వెల్లడించారు. ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోకపోతే ఇలా అగౌరవంగా మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు.

వివాదంలో యష్ తల్లి..

ఏది ఏమైనా దీపిక గురించి యష్ తల్లి పుష్ప చేసిన వ్యాఖ్యలు మాత్రం కన్నడ నాట పెద్ద ఎత్తున చర్చలకు కారణమవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై దీపికా కూడా ఘాటుగా సమాధానం ఇవ్వడంతో పుష్ప నుంచి ఏ విధమైనటువంటి స్పందన ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక దీపికా దాస్ పలు కన్నడ సినిమాలలో హీరోయిన్గా నటించడమే కాకుండా నాగిని సీరియల్ ద్వారా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. అలాగే కన్నడ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొని సందడి చేశారు. ఈ విధంగా పుష్ప ఈ వివాదంలో చిక్కుకోవడంతో హీరో యష్ పేరు పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంది. ఇక యశ్ సినిమాల  విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు . ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నారు. అదేవిధంగా బాలీవుడ్ రామాయణ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Actor Vishal: పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్… అప్పటివరకు ఆగాల్సిందేనా?

Related News

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Bandla Ganesh: చిరంజీవి కోసమే సింహాసనం.. మనస్సు ఉప్పొంగిపోయిందన్న బండ్లన్న!

Raviteja: రవితేజకు మాస్ మహారాజ్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?ఆ డైరెక్టర్ వల్లేనా?

Siddu Jonnalagadda: పాప్ కార్న్ అమ్ముకోవడానికి తెలుగులో ఈ పంచాయతీ, సిద్దు సంచలన వ్యాఖ్యలు

Big Stories

×