BigTV English

Actor Vishal: పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్… అప్పటివరకు ఆగాల్సిందేనా?

Actor Vishal: పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్… అప్పటివరకు ఆగాల్సిందేనా?

Actor Vishal: కోలీవుడ్ నటుడు విశాల్(Vishal) నేడు తన 48వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.  ఇలా తన 48వ పుట్టినరోజు (Birthday) నాడు ఈయన అభిమానులకు శుభవార్తను తెలియజేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా విశాల్ నటి దన్సిక(Dhansika) ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ పలు సందర్భాలలో జంటగా కనిపించడంతో వీరి ప్రేమ గురించి వార్తలు బయటకు వచ్చాయి అయితే ఓ కార్యక్రమంలో భాగంగా విశాల్ దన్సికతో తన ప్రేమ గురించి వెల్లడించారు. ఇలా వీరి ప్రేమ విషయాన్ని తెలియజేయడంతో విశాల్ పెళ్లి గురించి తరచూ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే తన పుట్టినరోజు నాడు పెళ్లి గురించి సర్ప్రైజ్ ఉండబోతుందని ఈయన వెల్లడించారు. చెప్పిన విధంగానే నేడు తన ప్రేయసితో నిశ్చితార్థం(Engagment) జరుపుకొని అందరికీ శుభవార్తను వెల్లడించారు.


రెండు నెలల తరువాతే వివాహం..

ఇలా విశాల్ ధన్సిక నిశ్చితార్థపు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .ఈ ఫోటోలు చూసినా అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా తనకు ఉదయం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు నిశ్చితార్థం జరుపుకున్నందుకు కూడా అభినందనలు కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో విశాల్ మాట్లాడుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇక నేడు తన పుట్టినరోజు సందర్భంగా ధన్సికతో తన నిశ్చితార్థం జరిగిందని తన చేతికి ఉన్న ఉంగరాన్ని కూడా చూయించారు. అదేవిధంగా పెళ్లి గురించి కూడా కీలక అప్డేట్ ఇచ్చారు. గత తొమ్మిది సంవత్సరాలుగా తామిద్దరం ప్రేమలో ఉన్నామని అయితే పెళ్లి కోసం మరో రెండు నెలలు ఎదురు చూస్తామని తెలిపారు.


నడియార్ సంగం భవనం పూర్తయిన తర్వాతనే..

తన వివాహం రెండు నెలల తర్వాతనే జరగబోతుందని ఈయన తెలియజేశారు. ప్రస్తుతం నడియార్ సంగం భవనం(Nadiyar Sangam Building) పూర్తి చేసిన తర్వాతనే తన వివాహం చేసుకుంటానని తెలియజేశారు. ప్రస్తుతం నడియార్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్ ఈ భవనం పూర్తి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. మరొక రెండు నెలలలో ఈ భవనం పూర్తి అవుతుందని, ఈ భవనం ప్రారంభించిన తర్వాత అందులోనే తన వివాహాన్ని చాలా ఘనంగా జరుపుకుంటానని తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన మాటలు బట్టి చూస్తుంటే తన వివాహం అక్టోబర్ చివరిన లేదా నవంబర్ మొదట్లో ఉంటుందని స్పష్టమవుతుంది.

హీరోయిన్లతో ప్రేమాయణం…

ఇక సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విశాల్ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రేమ పెళ్లి వార్తలలో నిలుస్తున్నారు. పలువురు హీరోయిన్లతో ఈయన ప్రేమలో ఉన్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. అలాగే ఇదివరకే మరొక నటితో నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థం రద్దు కావడంతో అప్పటినుంచి సింగల్ గా ఉన్న విశాల్ దన్సిక ప్రేమలో పడ్డారు. ఇలా తొమ్మిది సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇక వీరి నిచ్చితార్థపు ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.

Also Read: OG Movie : పవన్ కళ్యాణ్ ఓజీలో బిగ్ ట్విస్ట్.. సినిమాలో రాధిక అక్క క్యామియో ?

Related News

NTR: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేది అప్పుడే, అత్త సుహాసిని క్లారిటీ

Telugu star hero: ప్రొడ్యూసర్ వలనే సినిమా చేయను అని చెప్పిన స్టార్ హీరో, కానీ దర్శకుడు అంటే వీరాభిమానం

Deepika Das: గౌరవం ఇవ్వటం నేర్చుకోండి… హీరో యశ్ తల్లికి కౌంటర్ ఇచ్చిన దీపిక!

Mowgli Glimpse: జాగ్రత్తగా చూసుకోండి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై ఆ నటుడు సెన్సేషనల్ ట్వీట్

Akkineni Nagarjuna: రీ రిలీజ్ కి రెస్పాన్స్ లేదు, బర్త్ డే కు అప్డేట్ లేదు దారుణమయ్యా

Big Stories

×