Telugu star hero: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ దర్శకుడు తను. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. స్టార్ హీరోలతో రిపీటెడ్ గా వర్క్ చేశారు. ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు ముందుకు వస్తారు. ఈ తరుణంలో ఒక హీరో మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది.
ఆ హీరో వెనకడుగు వేయడానికి కారణం దర్శకుడు కాదు. సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్. అయితే ఇంకో ప్రొడ్యూసర్ ను వెతుక్కునే అవకాశం కూడా ఉంది. అయితే మరోపక్క ప్రొడ్యూసర్ కూడా ఈ దర్శకుడికి బాగా క్లోజ్. ఎందుకంటే ఈ దర్శకుడు కూడా ప్రొడక్షన్ లో ఒక భాగం అవుతాడు.
ప్రొడ్యూసర్ నచ్చకపోవడానికి కారణం
ఒకప్పుడు ప్రొడ్యూసర్లు ప్రవర్తించే తీరు ఒకలా ఉండేది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తీరు కంప్లీట్ గా మారిపోయింది. మైక్ దొరికితే చాలు వేదికల పైన చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటారు. అలా ఉత్సాహంగా మాట్లాడటం వలన, ఆ మాటలు ఇంకొంతమందిని నిరుత్సాహపరుస్తాయి.
ప్రతి హీరోకి అభిమానులు ఉన్నట్లే, ఇండస్ట్రీలో కూడా ఇండస్ట్రీ పీపుల్ కు అభిమానులు ఉన్నారు. అయితే ఈ ప్రొడ్యూసర్ ఒక హీరోకి వీరాభిమాని. అందుకే ఇంకో స్టార్ హీరో ఈ ప్రొడ్యూసర్ తో సినిమా చేయడానికి వెనకడుగు వేస్తున్నాడు.
ఏమైనా జరగొచ్చు
ఇండస్ట్రీలో ఏమైనా జరగొచ్చు. ఒకప్పుడు ఎస్ఎస్ రాజమౌళి పనిచేసిన హీరోలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పనిచేయడు అని అనుకున్నారు. అలానే త్రివిక్రమ్ హీరోలతో రాజమౌళి పనిచేయడు అనుకునేవారు.
కానీ అనూహ్యంగా ఎస్.ఎస్ రాజమౌళి హీరో ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు త్రివిక్రమ్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.
ఇప్పుడు త్రివిక్రమ్ తో ఏకంగా మూడు సినిమాలు చేసిన మహేష్ బాబు హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి సినిమా చేస్తున్నారు. సో ఇండస్ట్రీలో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. అలానే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ కాంబినేషన్ కూడా జరుగుతుందేమో చూడాలి.
Also Read: Mowgli Glimpse: జాగ్రత్తగా చూసుకోండి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై ఆ నటుడు సెన్సేషనల్ ట్వీట్