Pradeep Ranganathan : కోలీవుడ్ స్టార్ హీరో ప్రదీప్ రంగనాథన్ పేరు ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తుంది. డైరెక్టర్ నుంచి హీరోగా మారాడు. ఇప్పటివరకు ఈయన నటించిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా ఈ హీరో నటించిన డ్యూడ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.. కేవలం పాజిటివ్ టాక్ తో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. డైరెక్టర్ నుంచి హీరోగా మారిన ఇతని ఆస్తులు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇప్పటివరకు ఇతను ఎన్ని ఆస్తులు సంపాదించాడు అన్నది అటు కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ.. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది.. ఇక ఆలస్యం ఎందుకు ఈ డైరెక్టర్ సంపాదించిన ఆస్తుల విలువ ఎంతో ఒకసారి తెలుసుకుందాం..
ప్రదీప్ రంగనాథన్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెగ వినిపిస్తుంది. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరో క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇతను నటించిన డ్యూడ్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ఈ సినిమాతో మరింత జోష్ లో ఉన్నాడు ప్రదీప్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ప్రదీప్.. ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకి ఐదు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.. దాంతో ఆయన ఆస్తి 20 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్ లతో ఈ హీరో బిజీగా ఉన్నాడు. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలను మించి డ్యూడ్ మూవీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : దీపావళి స్పెషల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..
ప్రదీప్ రంగనాథన్ మమిత బైజు నటించిన లేటెస్ట్ మూవీ ‘డ్యూడ్’ దీపావళి కానుకగా అక్టోబర్ 17న రిలీజ్ అయ్యింది.. మొదటి రోజు ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండాఫ్ పై కంప్లైంట్స్ వినిపించాయి. మొదటి రోజు కాస్త కలెక్షన్లు డౌన్ అయినా సరే రెండో రోజు మాత్రం వీకెండ్ అవడంతో ఓపెనింగ్స్ భారీగానే జరిగాయి. దీంతో కలెక్షన్లు కూడా పెరిగాయి. 2 రోజుల్లో ఈ సినిమాకి రూ.4.08 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.7.38 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.6.92 కోట్లు వసూళ్లను రాబట్టాలి.. ఇదే జోరులో కలెక్షన్లు కనుక వస్తే ఈ సినిమా 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది.. మరి ఫైనల్ గా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు అనౌన్స్ అయిపోతున్నాడని సమాచారం.