Samantha : ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది సమంత (Samantha). ‘ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరి సరసన నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు, తమిళ్ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్య (Naga Chaitanya)ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత అడపాదడపా సినిమాలు చేసిన ఈమె.. అనూహ్యంగా నాలుగేళ్లకే విడాకులు ప్రకటించి విమర్శలు ఎదుర్కొంది.
అప్పటినుంచి ఆచితూచి అడుగులు వేస్తున్న సమంత.. చాలా తక్కువగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో అయితే.. తన నిర్మాణ సంస్థ ట్రాలాల మూవీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ‘శుభం’ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించిన ఈమె.. మళ్ళీ తెరపై కనిపించలేదు. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల ఆఖరిలో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇకపోతే సినిమాలు చేయకపోయినా సమంత ఇప్పుడు నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్ నెలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్ల జాబితాను విడుదల చేయగా.. అందులో నెంబర్ వన్ స్థానాన్ని సమంత దక్కించుకోవడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఆ తర్వాత స్థానాలలో ఆలియా భట్, కాజల్ అగర్వాల్, త్రిష, దీపికా పదుకొనే, నయనతార, రష్మిక, సాయి పల్లవి, తమన్నా , శ్రీలీల చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలియడంతో సమంత అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.
ALSO READ:Bandla Ganesh: దీపావళి పార్టీ కోసం బండ్లన్న పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా?
సాధారణంగా వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోయిన్లు లేదా వరుస వివాదాలతో నిత్యం ట్రోల్ అయ్యే హీరోయిన్స్ గురించి ఎప్పుడు ప్రేక్షకులు ఆరా తీస్తూ ఉంటారు. కానీ సినిమాలు లేకపోయినా ఈమధ్య సైలెంట్ అయిన సమంత ఇప్పుడు ఏకంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పడంతో సమంత ఎక్కడ ఉన్నా ఆమె నంబర్ వన్నే.. ఆమె రేంజ్ మామూలుగా ఉండదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సమంత నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడంతో అభిమానులు, నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సమంత కెరియర్ విషయానికి వస్తే.. ఒకవైపు బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. మరొకవైపు నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది. అలాగే ఒక కోలీవుడ్ సినిమాకి కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా శింబు నటిస్తున్నట్లు సమాచారం.