E-Paper
Advertisement

రెండు పార్టులుగా చిరు ‘విశ్వంభర ‘.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్..!

రెండు పార్టులుగా చిరు ‘విశ్వంభర ‘.. క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్..!
Advertisement

Viswambhara : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఈయన నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు.. నిజానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ గ్రాఫిక్స్ పెండింగ్ ఉండడంతో సినిమా వాయిదా పడింది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే డిసెంబర్ మూవీ రెండు పార్టులుగా రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలు పై డైరెక్టర్ వశిష్ట క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆయన ఏం చెప్పారు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

రెండు పార్ట్ లుగా విశ్వంభర..

టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ రెండు భాగాలుగా రానుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు డైరెక్టర్ వశిష్ఠ చెక్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. *అవునా.. నిజమా?’ అంటూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు. ఈ సింగిల్ లైన్ కౌంటర్‌తో ‘విశ్వంభర’ రెండు భాగాలుగా రావడం లేదని, ఇదొక అద్భుతమైన సింగిల్ ఎపిక్‌గా మాత్రమే ప్రేక్షకులను అలరించబోతోందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ మూవీ సింగిల్ గానే రాబోతుంది అంటూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుపోతుంది అంటూ డైరెక్టర్ చెబుతున్నారు.. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..

Advertisement

Also Read :Sreelee : చెన్నైలో నా పెళ్లి..? శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

గ్రాఫిక్స్ కోసమే అంత ఖర్చా..?

చిరంజీవి రీసెంట్గా నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కన్నా ముందుగానే సినిమా ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉంది.. కానీ గ్రాఫిక్స్ డిలే అవడంతో సినిమా విడుదల వాయిదా పడింది. నిజానికి విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చిరంజీవి సూచించడంతో మేకర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఈ మూవీలో దాదాపు 4,800కు పైగా హై-ఎండ్ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయట.. కేవలం గ్రాఫిక్స్ కోసమే దాదాపు 80 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సోషియో ఫాంటసీ వండర్‌లో సౌత్ క్వీన్ త్రిష ‘అవని’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, ఆషికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు కునాల్కపూర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ని భారీ అంచనాలతో జూన్ 10న థియేటర్లలోకి తీసుకురానున్నారు.. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రానున్న ఈ మూవీ చిరంజీవి ఖాతాలో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×