E-Paper
Advertisement

Euphoria OTT: ఈ సినిమా ఇప్పట్లో ఓటిటీలోకి రాదు..యుఫోరియా గురించి గుణశేఖర్..

Euphoria OTT: ఈ సినిమా ఇప్పట్లో ఓటిటీలోకి రాదు..యుఫోరియా గురించి గుణశేఖర్..
Advertisement

Euphoria OTT: ప్రస్తుతం సినిమాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా విడుదల అయితే నెలల పాటు థియేటర్లలో ఆడేది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సినిమా బాగున్నా, ఆవరేజ్‌గా ఉన్నా… కొద్దిరోజుల్లో ఓటిటీలో వచ్చేస్తుంది కదా..అని చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం మానేస్తున్నారు. ఈ ఆలోచనపై తాజాగా దర్శకుడు గుణశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

యుఫోరియా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన మీడియా ఈవెంట్‌లో గుణశేఖర్ మాట్లాడుతూ, ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ చేశారు. “ఈ సినిమా ఇప్పట్లో ఓటిటీలోకి రాదు. యుఫోరియా అనేది పూర్తిగా థియేటర్ అనుభవం కోసం తీసిన సినిమా. థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకులను గౌరవించి, వారి కోసం విలువతో ఈ సినిమాను రూపొందించాం” అని స్పష్టం చేశారు. కుటుంబ ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌లోనే ఈ సినిమాను చూడాలని ఆయన కోరారు.

Advertisement

గుణశేఖర్ మాట్లాడుతూ, “యుఫోరియా సినిమా మీకు ఒక అనుభవాన్ని ఇస్తుంది. మీరు చూసిన తర్వాత ఏదో ఒకటి మీతో పాటు ఇంటికి తీసుకెళ్లేలా ఉంటుంది. కేవలం వినోదం మాత్రమే కాదు, ఆలోచన కూడా కలిగిస్తుంది” అని అన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకుని నిరాశ చెందుతున్నారని, అందుకే ఈ సినిమాను ఓపెన్ మైండ్‌తో చూడాలని సూచించారు.

యుఫోరియా సినిమా యూత్ ఓరియెంటెడ్ కథతో పాటు, సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ కల్చర్, యువత ఎదుర్కొనే సమస్యలపై దృష్టి పెట్టింది. ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్‌గా, సోషల్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా, భూమికా చావ్లా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. గౌతమ్ మీనన్, నాజర్ వంటి అనుభవజ్ఞులైన నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

Advertisement

సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా రన్‌టైమ్ సుమారు 2 గంటల 30 నిమిషాలు. కథలోని నిజాయితీ, తీవ్రత కారణంగా కొన్ని సన్నివేశాలు బలంగా ఉంటాయని యూనిట్ చెబుతోంది. అందుకే ఇది పెద్దల కోసం రూపొందిన సినిమా అని స్పష్టం చేశారు.

మొత్తం పైన యుఫోరియా సినిమా ఓటిటీలో చూసే సినిమా కాదు అని దర్శకుడు గుణశేఖర్ స్పష్టంగా చెబుతున్నారు. థియేటర్‌లో కూర్చొని అనుభవించాల్సిన సినిమా అని, ప్రేక్షకులు తప్పకుండా పెద్ద తెరపై చూసి ఆ అనుభూతిని పొందాలని ఆయన కోరుతున్నారు.

ALSO READ: Euphoria సినిమా ఈవెంట్ స్పీచ్ మధ్యలో ఏడ్చేసిన భూమిక.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన హీరోయిన్!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×