BigTV English

Vishal Sai Dhanshika: ఘనంగా సాయి ధన్సికతో హీరో విశాల్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!

Vishal Sai Dhanshika: ఘనంగా సాయి ధన్సికతో హీరో విశాల్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!

Vishal Sai Dhanshika: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) ఎట్టకేలకు తన ప్రియురాలు , ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సిక (Sai Dhansika) తో నిశ్చితార్థం జరుపుకున్నారు..ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు.” నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ.. నాకు విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజునే నా కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో సాయి ధన్సికతో నాకు నిశ్చితార్థం జరిగింది. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు హీరో విశాల్. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన పంచుకోవడం జరిగింది. ఈ జంటను చూసిన అభిమానులు చాలా చూడచక్కగా ఉంది ఈ జంట అంటూ కామెంట్లు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా హీరో విశాల్ ఎప్పుడు వివాహం చేసుకుంటారని అభిమానులు ఆశగా ఎదురు చూడగా.. ఎట్టకేలకు గతంలో తన పెళ్లి గురించి ప్రకటించి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకొని తొలి అడుగు వేశారు.


హీరోయిన్ సాయి ధన్సిక బ్యాక్ గ్రౌండ్..

విశాల్ వివాహం చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సిక అన్న విషయం అందరికీ తెలిసిందే. తమిళనాడు తంజావూరుకు చెందిన ఈమె 2006లో మనతోడు మజైకాలం సినిమాతో ఇండస్ట్రీలో నటిగా మారింది. మెరీనా అనే స్క్రీన్ నేమ్ తో ప్రేక్షకులకు పరిచయమైంది. 2009లో వచ్చిన కెంప అనే చిత్రంతో కన్నడ సినీ పరిశ్రమలోకి కూడా అడుగు పెట్టింది. అలా పలు సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె కబాలి సినిమాలో రజనీకాంత్ కూతురుగా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. ఇక నేరుగా షికారు సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి ధన్సిక.. అంతిమ తీర్పు, దక్షిణ లాంటి తెలుగు చిత్రాలలో నటించింది. విశాల్ తో గత 15 సంవత్సరాలుగా పరిచయం ఉందని, ఆ పరిచయం స్నేహంగా మారి ఇప్పుడు ప్రేమకు దారి తీసింది అని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని గతంలో చెప్పుకొచ్చింది. ఇక నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి డేట్ కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం


also read: Komali Prasad: ఆశగా ఎదురుచూస్తున్నా.. ఊహించని కామెంట్స్ చేసిన నాని హిట్ 3 బ్యూటీ! 

 

Related News

Chiranjeevi: మెగాస్టార్ గొప్ప మనసు.. మహిళా అభిమానికి అందమైన బహుమతి..

Komali Prasad: ఆశగా ఎదురుచూస్తున్నా.. ఊహించని కామెంట్స్ చేసిన నాని హిట్ 3 బ్యూటీ!

Nikhil Siddhartha: నిఖిల్ అన్నా.. స్వయంభు ఉన్నట్టా .. లేనట్టా ?

HBD Nagarjuna : 100 కోట్ల టార్గెట్ గా 100వ మూవీ… అందుకే ఈ ఆలస్యం

Monalisa: సౌత్ లోకి కుంభమేళా మోనాలిసా ఎంట్రీ.. ఏ హీరో సినిమానో తెలుసా..?

Big Stories

×