Satish Chandar: పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుందని పెద్ద వారు తరుచుగా చెప్పే మాట. పుస్తకాలను మిత్రులుగా చేసుకుంటే బంగారు భవిష్యత్తు సొంతం అవుతోంది. దీనికి ప్రపంచంలో ఎన్నో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రముఖ కవులు రచించిన పుస్తకాలను చదివి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారు కోకోల్లలు. పుస్తకం మనిషికి ఓ మంచి దారిని చూపిస్తోంది. అందుకే పుస్తకాలను చదివితే మంచి వివేకవంతులు అవుతారని పెద్దలు చెబుతుంటారు.
⦿ ఈ రోజు సాయంత్రం అద్భుతమైన పుస్తక ఆవిష్కరణ
అయితే ఈ రోజు ఓ అద్భుతమైన పుస్తకా ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్, బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ రచయత సతీష్ చందర్ రచించిన అద్భుతమైన ‘మూడు ముడులు ముప్పయి మూడు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 5:30 గంటలకు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రసిద్ధ రచయిత్రి ఓల్గా పాల్గొంటున్నారు. ప్రముఖ రచయిత్రి మృణాళిని ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ఈ సభకు సన్నిధానం నరసింహ శర్మ అధ్యక్షత వహిస్తున్నారు. పుస్తక పరిచయం గురించి జర్నలిజం అధ్యాపకులు స్రవంతి మాట్లాడనున్నారు.
⦿ పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథి ఎవరంటే?
తేదీ: అక్టోబర్ 29
సమయం: సాయంత్రం 5:30 గంటలకు
వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్
గెస్ట్, ఆవిష్కర్త: సుప్రసిద్ద రచయిత్రి ఓల్గా
ప్రారంభ ఉపన్యాసం: సుప్రసిద్ధ రచయిత్రి సి. మృణాళిని
సభాధ్యక్షత: పరిశోధుకులు సన్నిధానం నరసింహ శర్మ
ఆహ్వానించువారు: గౌరీ చందర్ (కరస్పాండెంట్, ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం)