Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా సెలబ్రిటీలు డీప్ ఫేక్ వీడియోలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గుర్తు తెలియని కొంతమంది నేరగాళ్లు తమ ఫోటోలను, వాయిస్ ను ఉపయోగించి తప్పుదోవ పట్టిస్తున్నారు అని.. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత అశ్లీల కంటెంట్ తయారుచేసి సోషల్ మీడియాలో వదులుతూ పరువుకు నష్టం కలిగిస్తున్నారు అంటూ సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇకపై అనుమతి లేకుండా బహిరంగంగా ఎక్కడా ఫోటోలు కానీ.. పేర్లు కానీ.. ట్యాగులు కూడా ఉపయోగించకూడదని కఠిన ఆదేశాలు జారీ చేయాలి అని పిటిషన్ వేస్తున్నారు. అటు కోర్టులు కూడా సెలబ్రిటీలకు అనుకూలంగా తీర్పులు ఇస్తున్నా.. చిరంజీవి విషయంలో మాత్రం ఇది మళ్ళీ పునరావృతం కావడం ఆలోచించదగిన విషయం అనే చెప్పాలి.
అసలు విషయంలోకి వెళ్తే.. గతవారం రోజుల క్రితం తన ఫోటోలను ,తన పేరును , తన ట్యాగ్ ను ఉపయోగించి ఏఐ కంటెంట్ వీడియోలు సృష్టించి పరువుకు నష్టం కలిగిస్తున్నారని చిరంజీవి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే అటు వీసీ సజ్జనార్ , ఇటు కోర్టు కూడా చిరంజీవికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ చిరంజీవి పోలీసులను ఆశ్రయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా తనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్ట్లు పెట్టి తిడుతున్న కొన్ని ఎక్స్ హ్యాండిల్ ప్రొఫైల్స్ ని పోలీసుల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఇటీవలే సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినా తనపై ఇంకా వల్గర్ కామెంట్ లు చేస్తున్నారని చిరంజీవి మండిపడ్డారు. అంతేకాదు వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
also read:HBD Nagababu: ఆరోజు తమ్ముడి నిర్ణయం.. నేడు నిలదొక్కుకోవడానికి కారణం అయిందా?
ఇదిలా ఉండగా మరొకవైపు కొన్ని రోజుల క్రితమే తన ఫోటోలను డీప్ ఫేక్ చేస్తున్నారని పోలీసులను చిరంజీవి ఆశ్రయించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారని, అవి వైరల్ గా మారుతున్నాయని.. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి సీపీవీసీ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు..అనంతరం కోర్టుకి కూడా సమాచారం ఇవ్వడంతో.. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకొని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటు వీసీ సజ్జనార్ కూడా ఇకపై చిరంజీవికి సంబంధించిన వ్యక్తిగత అంశాలను ఎవరైనా వాడుకున్నా.. ఫోటోలను మార్ఫింగ్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా సరే ఇంకా ఎక్స్ హ్యాండిల్స్ లో ఇలా చిరంజీవిని టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హోదా ఉన్న వ్యక్తికే ఇలాంటి తిప్పలు తప్పలేదు అంటే ఇక మిగతా వారి పరిస్థితి ఏంటి అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.
మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి
సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు
ఈ మేరకు ఓ 'ఎక్స్' ఖాతాను జోడిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చిరంజీవి
ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంకా ఇలాంటి పోస్టులు… https://t.co/lGBSMWn3f1 pic.twitter.com/GB1BVYIqgh
— BIG TV Breaking News (@bigtvtelugu) October 29, 2025