ROHIT SHARMA: టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ నెంబర్ 1 స్థానానికి ఎగబాగాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల సిరీస్ లో భాగంగా రెండవ వన్డేలో {73}, మూడో వన్డేలో {121} పరుగులతో చెలరేగడంతో 36 రేటింగ్ పాయింట్లు మెరుగుపరుచుకొని.. తొలిసారి వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానాన్ని అధిరోహించాడు.
Also Read: Navjot -MS Dhoni: పెళ్లి తర్వాత ధోని ఎనర్జీ డౌన్… సిద్ధూది మాత్రం ఏ రేంజ్.. పోస్ట్ వైరల్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ {781} పాయింట్లతో నిలిచాడు. అంతేకాకుండా 38 ఏళ్ల 182 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ కావడం విశేషం. తన కెరీర్ లో ఫస్ట్ ప్లేస్ కి చేరుకోవడం ఇదే మొదటిసారి. ఇక కెప్టెన్ గిల్ {745} పాయింట్లతో రెండు స్థానాలు కోల్పోయి మూడవ స్థానానికి పరిమితమయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ 764 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.
గతవారం ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడవ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ.. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మొదటి స్థానానికి చేరాడు. ఈ క్రమంలో మొదటి స్థానంలో తిష్ట వేసిన తన సహచరుడు, వన్డే కెప్టెన్ గిల్ ని కిందికి దించాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, గిల్ తర్వాత నెంబర్ వన్ వన్డే బ్యాటర్ గా అవతరించిన భారత బ్యాటర్ గాను రికార్డులలోకి ఎక్కాడు రోహిత్ శర్మ.టెస్ట్ , టి-20 ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ.. ఏడు నెలల విరామం తర్వాత తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ చేసిన ప్రదర్శన అతడిని ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకర్ గా నిలిపింది.
ఇక ఐసీసీ విడుదల చేసిన బౌలర్ల ర్యాంకింగ్ విషయానికి వస్తే ఆఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ మూడు స్థానాలు పైకి ఎగబాకి నాలుగవ స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజిల్ వుడ్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిదవ స్థానానికి చేరాడు. ఇక టీమ్ ఇండియా తరఫున కేవలం ఒక్కరు మాత్రమే ఉండడం గమనార్హం.
Also Read: Suryakumar Yadav Mother: ఆస్పత్రిలో శ్రేయాస్.. సూర్య కుమార్ తల్లి సంచలన నిర్ణయం
కుల్దీప్ యాదవ్ 634 పాయింట్లతో ఒక ప్లేస్ ని కోల్పోయి ఏడవ ర్యాంకులో నిలిచాడు. అలాగే ఆల్రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా 215 మాత్రమే ఉన్నాడు. రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ కి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అక్షర్ పటేల్ 208 పాయింట్లతో 2 స్థానాలను మెరుగుపరుచుకొని 12వ ర్యాంకులో నిలిచాడు.