Malavika Mohanan: మాళవిక మోహనన్ (Malavika Mohanan)ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈమె ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరికెక్కిన ది రాజా సాబ్(The Raja Saab) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలోనే మరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలు మాళవిక ఛాన్స్ అందుకున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు బాబి(Bobby) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)హీరోగా నటిస్తున్న సినిమాలో మాళవిక మోహన్ ఎంపిక అయ్యారు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇలా ఈ విషయం గురించి చిత్రం బృందం ఇప్పటివరకు ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో ఈ వార్తలపై మాళవిక మోహనన్ స్పందించారు. ఈ సందర్భంగా మాళవిక మెగా 158 సినిమా గురించి ఎక్స్ వేదికగా స్పందిస్తూ..తాను మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158 సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నాననే వార్తలను గత కొద్ది రోజులుగా చూస్తున్నాను అయితే ఎప్పటినుంచో నేను కూడా చిరంజీవి గారితో కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఆయనతో కలిసి నటించాలని ఉన్న ఈ సినిమాలో మాత్రం నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
తాను చిరంజీవి సినిమాలో నటిస్తున్నాను అంటూ వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమే అంటూ ఈ సందర్భంగా మాళవిక ఈ వార్తలను ఖండిస్తూ అసలు విషయం వెల్లడించారు. ఇలా మాళవిక ఈ సినిమాలో నటించడం లేదని వార్తలు బయటకు రావడంతో మరి మెగా 158లో హీరోయిన్ గా ఎవరు సందడి చేయబోతున్నారనే విషయంపై మరోసారి మెగా అభిమానులు చర్చలు మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కీలకపాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కార్తీ ఫుల్ లెన్త్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.
నవంబర్ లో పూజ కార్యక్రమాలు
ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి అయ్యాయని అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక నవంబర్ నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుని షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలన్న ఆలోచనలో అనిల్ రావిపూడి సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ అనంతరం బాబి డైరెక్షన్లో బిజీ కాబోతున్నారు. ఇదివరకే బాబి చిరంజీవి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: Arundathi Remake: రీమేక్ కు సిద్ధమైన అరుంధతి.. జేజమ్మ పాత్రలో నటించేది ఈ హీరోయినే ?