IND VS AUS: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ టి20 సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. అయితే టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలోనే మ్యాచ్ కు భారీ అంతరాయం ఏర్పడింది. కాన్ బెర్రాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయింది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టి20 మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఈ మ్యాచ్ 5 ఓవర్లు ముగిసే సమయానికి భారీ వర్షం పడింది. ఆ సమయంలో ఒక వికెట్ కోల్పోయిన టీమిండియా 43 పరుగులు చేసింది. వర్షం భారీగా పడడంతో మ్యాచ్ ఆపేశారు అంపైర్లు. దీంతో స్టేడియం సిబ్బంది రంగంలోకి దిగి పిచ్ పై కవర్స్ కప్పారు. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో స్టేడియానికి వచ్చిన అభిమానులతో పాటు టీవీలో చూస్తున్న వారంతా నిరాశకు గురవుతున్నారు.
వర్షం పడే సమయానికి సూర్య కుమార్ యాదవ్ మంచి టచ్ లోకి వచ్చాడు. ఒక సిక్సర్ కూడా బాదాడు. ఏడు బంతుల్లో 8 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ అటాకింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అటు మరో ఓపెనర్ గిల్ 9 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఇందులో మూడు బౌండరీలు ఉండడం గమనార్హం. ఇక అటు డేంజర్ బ్యాటర్ అభిషేక్ శర్మ 14 బంతుల్లోనే 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇందులో నాలుగు బౌండరీలు ఉన్నాయి. 135 స్ట్రైక్ రేటుతో రెచ్చిపోతున్న అభిషేక్ శర్మను నాథన్ ఎల్లిస్ అవుట్ చేశాడు. బారీ షాట్ కు ప్రయత్నించిన అభిషేక్ శర్మ టీం డేవిడ్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టి20 మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారిన తరుణంలో అంపైర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. దీంతో ఆ సమయాన్ని కవర్ చేసేందుకు డక్ వర్త్ లూయిస్ సిస్టం ప్రకారం, ఈ మ్యాచ్ లో ఓవర్లను కుదించారు. 20 ఓవర్లను కాస్త 18 ఓవర్లకు తగించారు. ఇలా ఓవర్లు కుదించడం కచ్చితంగా ఆస్ట్రేలియాకు కలిసివచ్చే ఛాన్సు ఉంటుంది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొన్న తొలి వన్డేలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇవాళ కూడా టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగానే, వర్షం పడింది. మరి ఇవాళ్టి మ్యాచ్ లో తక్కువ ఓవర్లను బాగా వినియోగించుకుని, టీమిండియా భారీ స్కోర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆస్ట్రేలియా విజయం సాధించే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇక ప్రస్తుతం అయితే, సూర్య, గిల్ అద్భుతంగానే ఆడుతున్నారు.
Also Read: Indian Team: ఎముకలు కొరికే చలిలో టీమిండియా ప్రాక్టీస్.. చేతులు పగిలిపోతున్నాయి.. వీడియో వైరల్
Rain halts play in Canberra after just five overs! ☔
Let’s hope the rain stays away and we get a complete match! 🇦🇺🇮🇳🙌#AUSvIND #T20Is #Canberra #Sportskeeda pic.twitter.com/HFBIUXvogy
— Sportskeeda (@Sportskeeda) October 29, 2025