The Great Pre Wedding Show Trailer: ప్రయోగాత్మక చిత్రాలతో ముందు నుంచి ఆడియన్స్ ని అలరిస్తున్నాడు తీరువిర్. మసూద, పరేషాన్ వంటి చిత్రాలతో అతడు మంచి గుర్తింపు పొందాడు. మసూదతో భయపెట్టిన తీరువీర్ ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో నవ్వించేందుకు వస్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో‘ (The Great Pre Wedding Show). టీనీ శ్రావ్య హీరోయిన్ గా నటిస్తుంది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అశ్మితా రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 07న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి ప్రేక్షకులు మంచి వినోదం అందించబొతున్నారని అర్థమైపోతుంది. ప్రస్తుతం పెళ్లిళ్లు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ తప్పనిసరి. ఇందుకోసం కాబోయే జంట లక్షలు పెట్టి మరి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ని తీయించుకుంటుంది. ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్న ఓ విలేజ్ కపుల్ ఆధారంగా ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో తిరువీర్ ఫోటోగ్రాఫర్‌గా కనిపించబోతున్నాడు.
ఓ గ్రామంలో హీరో ఫోటోగ్రాఫర్ గా చేస్తుంటాడు. అదే ఊరికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. దీంతో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలని ఆశపడతాడు. అందుకని మండలంలోనే బెస్ట్ ఫొటోగ్రాఫర్ కావాలని వెతికే సమయంలో అతడికి హీరో కనిపిస్తాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ చేయటానికి ఒప్పుకున్న హీరో.. నానా కష్టాలు పడి ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ తీస్తాడు. అంత కష్టపడ్డ ఆ షూట్ కి సంబంధించిన చిప్ పోతుంది. ఫోటోలు కావాలని ఆ వ్యక్తి వెండపడుతుంటే మన హీరో ఎలా తప్పించుకున్నాడు అనేది ఈ కథ. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు, హీరో అసిస్టెంట్ కామెడీ ఆడియన్స్ ని మంచి వినోదం అందిస్తుందనిపిస్తోంది.