BigTV English
Advertisement

Arundathi Remake: రీమేక్ కు సిద్ధమైన అరుంధతి.. జేజమ్మ పాత్రలో నటించేది ఈ హీరోయినే ?

Arundathi Remake: రీమేక్ కు సిద్ధమైన అరుంధతి.. జేజమ్మ పాత్రలో నటించేది ఈ హీరోయినే ?

Arundathi Remake: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క(Anushka) ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం అరుంధతి(Arundathi). 2009వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లోనే అనుష్క ఇలాంటి ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టడంతో ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు.


జేజమ్మ పాత్రలో శ్రీ లీల..

ఇక ఈ సినిమాలో అరుంధతి పాత్రలో అనుష్క తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా హిందీ రీమేక్ గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తెలుగులో అనుష్క అరుంధతిగా నటించి మెప్పించారు. ఈ క్రమంలోనే హిందీ రీమేక్ లో జేజమ్మ పాత్రలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela)నటించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు సమాచారం.

మోహన్ రాజా దర్శకత్వంలో అరుంధతి..

ఇక ఈ సినిమాని తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా హిందీలో మాత్రం తని ఒరువన్ ఫేమ్ మోహన్ రాజా (Mohan Raja)ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించబోతున్నారు. ఇక ప్రస్తుతం శ్రీలీల సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకొంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే ఈమె ప్రధాన పాత్రలో అరుంధతి సినిమా రాబోతోంది అనే విషయం తెలిసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


పశుపతిగా సోను సూద్..

మరి అనుష్క మాదిరిగా జేజమ్మ పాత్రలో శ్రీ లీల తన నటనతో మెప్పించగలరా ? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక అరుంధతి సినిమాలో నటుడు సోను సూద్ పశుపతి పాత్ర కూడా హైలెట్ గా నిలిచింది. సోను సూద్ తో పాటు అర్జన్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2009లో విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఏకంగా 7 విభాగాలలో ఏకంగా నంది పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. ఇలాంటి సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేస్తూ శ్రీ లీల నటించబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక శ్రీ లీల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర(Mass Jathara) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Related News

Venky Trivikram : సినిమా ఫస్ట్ షెడ్యూల్ అప్పుడే, వెంకటేష్ తో శ్రీనిధి కీలక సీన్స్

Rahul Ravindran: అత్తారింటికి దారేది సినిమా రిజెక్ట్ చేశాను, అంత ఇంపార్టెంట్ పాత్ర ఏంటి?

Deepika Padukone: దీపికాకు మరో షాక్ ఇచ్చిన కల్కి టీమ్.. ఇంత పగ పట్టారేంటీ?

Ravi Teja : చిరంజీవి దర్శకుడితో రవితేజ సినిమా, డిస్కషన్స్ జరుగుతున్నాయి 

Suriya: మరో తెలుగు డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య, ప్రొడ్యూసర్ గా దిల్ రాజు

SYG : సంబరాల ఏటిగట్టు సినిమా కాన్సెప్ట్ ఇదే, తమిళ్ దర్శకుల నుంచి ఇన్స్పైర్ అయ్యారా?

Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై తుఫాన్ ప్రభావం, ఈవెంట్ క్యాన్సిల్

MassJathara vs Bahubali The Epic: మాస్ జాతర vs బాహుబలి ది ఎపిక్.. బాక్సాఫీస్ విజేత ఎవరు?

Big Stories

×