Hyderabad Crime: హైదరాబాద్‌లో ఎయిర్‌హోస్టెస్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది? అందుకు కారణాలేంటి? డిప్రెషన్ కారణంగా ఆమె సూసైడ్ చేసుకుందా? ఎందుకు ఆమెపై రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి? పోలీసులు ఏమంటున్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
హైదరాబాద్‌లో ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య
జమ్మూకాశ్మీర్‌కు చెందిన 28 ఏళ్ల జాహ్నవి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తుంది. నాలుగేళ్లుగా రాజేంద్రనగర్ ప్రాంతంలోని శివరాంపల్లి కెన్‌ఫుడ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. ఆత్మహత్యకు ముందు జాహ్నవి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. పార్టీ జరిగిన మరుసటి ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టింది. తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అందుకు కారణాలు ఏంటనేది తెలీదు.
ఎప్పటి మాదిరిగా ఆమెకు స్థానికులు ఫోన్ చేశారు. లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. స్థానికులు ఆ విషయాన్ని అపార్ట్‌మెంట్ వాసులకు తెలిపారు. వెంటనే వారు జమ్మూకాశ్మీర్‌లో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అపార్ట్‌మెంట్ వాసుల సమాచారంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టారు. అప్పటికే జాహ్నవి ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది.
రకరకాల వార్తలపై ఫ్యామిలీ క్లారిటీ
వెంటనే ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత తల్లిదండ్రులను అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాహ్నవి రూమ్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరీక్ష కోసం పంపించారు. జాహ్నవి మృతిపై కుటుంబం ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
గడిచిన నాలుగేళ్లుగా జాహ్నవి హైదరాబాద్‌లో ఉంటోంది. కొన్ని నెలలుగా వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా ఆమె నిరాశకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. రకరకాల వార్తల నేపథ్యంలో జాహ్నవి కుటుంబ సభ్యులు నోరు విప్పారు. డిప్రెషన్ కారణమని భావిస్తున్నట్లు మృతురాలి తల్లి సోనికా, సోదరుడు చెప్పారు. జాహ్నవి ఇప్పుడు మనతో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు.
ALSO READ: చెన్నైలో దారుణం.. మహిళపై లైంగికదాడి చేసిన బైక్ డ్రైవర్
ఆమె మృతి గురించి రకరకాల సందేశాలు వస్తున్నాయని, ఓ పైలట్‌తో ఆమెకు ఎలాంటి సంబంధం లేదన్నారు. జాహ్నవిపై పుకార్లను వ్యాప్తి చేసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కూతురు మృతిపై ఆమె తల్లి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు పోలీసులు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.