NTR Neel: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ (NTR ).. రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈయన.. అటు జపాన్ లో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ‘దేవర’ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్టు పై అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. దీనికి కారణం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రకటించడమే.. ఎన్టీఆర్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ డ్రాగన్ సినిమాలో అంతకుమించి విధ్వంసాన్ని సృష్టించేలా ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్ .
అందులో భాగంగానే ప్రత్యేకించి ఎన్టీఆర్ లుక్స్ పై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక కీలక సన్నివేశంలో ఎన్టీఆర్ ఏకంగా షర్టు లెస్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఫైట్లు , సీక్వెన్స్లు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలలో కాకుండా కంప్లీట్గా ఒక కొత్త స్టైల్ లో డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ ను ఈ సన్నివేశాలు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. రా అండ్ రియల్లీస్టిక్ యాక్షన్ కొరియోగ్రఫీతో ఈ చిత్రాన్ని ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే జోర్దాన్లో షెడ్యూల్ ముగియగా అందులో తారక్ రియల్ స్టంట్స్ చేసినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా ఎన్టీఆర్ తన సినిమాల కోసం ఏ రేంజ్ లో బరువు తగ్గుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సింహాద్రి, ఆది లాంటి చిత్రాలలో బొద్దుగా కనిపించిన ఈయన కంత్రి చిత్రంలో ఎంత బక్క పీలగా కనిపించారో అందరికీ తెలిసిందే . అవసరమైతే తనను తాను పూర్తిగా మార్చుకోవడంలో ఎన్టీఆర్ ముందుంటారు. ఈ క్రమంలోనే దాదాపు పది కిలోల వరకు బరువు తగ్గిన ఎన్టీఆర్ ఇప్పుడు చాలా బక్కగా కనిపిస్తున్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కేవలం ఫిట్నెస్ కోసం మాత్రమే కాదు సినిమాలోని హై ఇంటెన్సిటీ ఫైట్స్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఇందులో ఎన్టీఆర్ తన కొత్త లుక్ తో అభిమానులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధం అయిపోయారు. మరి ఈ హై ఇంటెన్సిటీ ఫైట్స్ సీన్స్ సినిమా విజయానికి ఏ విధంగా దోహదపడతాయో చూడాలి.
also read:Vijay -Rashmika: విజయ్- రష్మిక పెళ్లి.. కొత్త కోడల్ని అలా పిలుస్తూ అత్త ఎమోషనల్!
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 25 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ విలన్ గా కనిపిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.