Real Estate Fraud స్వేచ్ఛ బ్యూరో: రియల్ ఎస్టేట్ దందాలో బెంగళూరు ముఖ్య కేంద్రంగా ఉండి గత 15 సంవత్సరాలుగా వెంచర్లను నెలకొల్పి రియల్ ఎస్టేట్ రంగంలో అనతి కాలంలోనే సక్సెస్ ఫుల్ కంపెనీగా వ్యాపార రంగంలో గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో అనంతపురం, కర్నూల్లో తమ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి సబ్ ఆఫీస్ లను కూడా గత ఐదేళ్ల నుంచి ప్రారంభించి ఇక్కడి కస్టమర్లకు కూడా కంపెనీ చేరువైంది. ఈ నేపథ్యంలో కంపెనీ మరింత విస్తరించేందుకు కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలోని ఒక గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి డోన్‌లోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఇటీవలే రిటైర్డ్ అయ్యాక అతని ఇద్దరు కుమారుల్లో ఒకరు అమెరికాలో ఉద్యోగం చేస్తూ సిటిజన్ షిప్ పొందగా మరో కుమారుడు బెంగళూరులో గత 15 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతంగా వెంచర్లను నిర్వహించడంతో కంపెనీ పేరు మంచి గుర్తింపునే పొందింది. ఈ నేపథ్యంలో రియల్ వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో డోన్ పట్టణంలో పరిచయస్తుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నారు. పెద్ద మొత్తంలో తీసుకుంటున్న నగదుకు నెల, ఆరు నెలలు, ఏడాది చొప్పున వడ్డీ చెల్లించేలా ఒప్పందం చేసుకొని కోట్లాది రూపాయలు అప్పు చేశారు. మొదట్లో వాటికి వడ్డీని సైతం రెగ్యులర్ గా కట్టేవారు. డోన్, కర్నూలు, విజయవాడ పట్టణాల్లోనే ప్రధానంగా ప్రముఖులైన వ్యక్తుల వద్దనే ఒక్కొక్కరి నుంచి 50 లక్షలు మొదలుకొని 13 కోట్ల వరకు అప్పులు చేశారు.
రియల్ కంపెనీ ఆస్తులు బెంగుళూరు, అనంతపురంలో 125 కోట్ల వరకు ఉంటాయని కంపెనీ సిబ్బంది బాధితులతో తెలిపినట్లు సమాచారం. ఇదే క్రమంలో అప్పులు సైతం 270 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం గత రెండేళ్లుగా కుదేలవడంతో చేసిన అప్పులకు వడ్డీలను చెల్లించలేని పరిస్థితిలో గత కొంతకాలంగా సతమతమవుతూ ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ గత అక్టోబర్ వరకు అప్పులు ఇచ్చిన వారికి వడ్డీని కూడా చెల్లించినట్లు తెలిసింది అయితే ఒకరి దగ్గర 13 కోట్లు తీసుకోగా వారికి ఇచ్చిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకున్న క్రమంలో అనుమానం రావడంతో వారి డబ్బును తిరిగి చెల్లించేందుకు రియల్ వ్యాపారిపై ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. దీంతో మిగతావారు సైతం ఒత్తిడి తేవడం మొదలెట్టారు. అయితే కొందరికి తమ వద్ద ఉన్న కార్లను అమ్మి కొందరికి సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. అనేకమంది బాధితులకు వడ్డీలు చెల్లించలేని పరిస్థితి రావడంతో అప్పుల వారి తాకిడి అధికమవడంతో చేసేదేమి లేక ఉన్నఫలంగా విదేశాల్లో ఉన్న తన కుమారుడుభార్య దగ్గరకు చూసేందుకని గత నవంబర్ 18 న అమెరికాకు వెళ్ళిపోయాడు. అప్పటినుంచి అతని ఫోన్ నెంబర్, వాట్సప్ అన్నీ కూడా యాక్టివ్ లేకపోవడంతో తిరిగి నేటికీ రాకపోవడంతో బాధితులు దేశం ఇచ్చి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఇలా అన్ని దేశాలలో పర్యటించేందుకు వీసాలు సైతం పొందారని సమాచారం.
Also Read: Munna Re Release: ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా.. మున్నా వస్తున్నాడు
రియల్ ఎస్టేట్ వ్యాపారి సుమారు 256 మంది దగ్గర 36% వడ్డీకి ఆశ చూపి పెద్ద మొత్తంలో వసూలు చేయగా వాటికి వడ్డీలు కట్టలేక, అసలు చెల్లించలేక 210.26 కోట్ల రూపాయలకు ఐపి పిటిషన్ (ఐపి 01/2026) గద్వాల కోర్టులో దాఖలు కావడంతో వందలాది మంది పెట్టుబడిదారుల ఆశలు అడియాశలు అయ్యాయి. అసలు ఈ వ్యక్తి గద్వాల ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోవడం ఏపీలో ఉంటూ అప్పులు చేసి గద్వాలలో గత మూడు సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్నట్లు తన అడ్రస్ మార్చుకున్నాడని సమాచారం. లాయర్లతో మంతనాలు చేస్తూ కోర్టు నోటీసులు గద్వాలకి వచ్చేలా పక్క ప్లాన్ వేసుకొని ఈతంగానికి పాల్పడ్డాడని బాధితులు లబోదిబోమంటున్నారు. ఏపీలో చేసిన అప్పులకి ఆ రియాల్టర్ గద్వాలను ఐపీ కి ఎంచుకోవడంతో జిల్లాలో ఈ అంశం బయటికి పొక్కడంతో జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశమైంది.
Also Read: Bhu Bharati: ధరణి తెచ్చిన భూ భారతికి కష్టాలు.. పరిష్కారాలకంటే సమస్యలే ఎక్కువ..!