ఏపీ కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రైళ్ల వేగం మరింత పెరిగేలా కీలక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా గుంటూరు-పగిడిపల్లి, మోటుమారి-విష్ణుపురం సెక్షన్ మధ్య కీలక అభివృద్ధి పనులు చేపట్టనుంది. ఈ విభాగాల మధ్య విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ. 188.31 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే మంత్రిత్వ శాఖ అప్‌గ్రేడేషన్ ప్రాజెక్టును మంజూరు చేసింది.
రైల్వేశాఖ ప్రతిపాదించిన రెండు మార్గాల్లో మెరుగైన రైల్వే సామర్థ్యం, కార్యకలాపాలను పెంచడానికి విద్యుత్ వ్యవస్థను అప్ గ్రేడ్ చేయనున్నారు. ప్రస్తుతంగా ఈ మార్గాల్లో 1×25 KV ట్రాక్షన్ వ్యవస్థ ఉండగా, దీనిని అధునాతన 2×25 KV వ్యవస్థగా అభివృద్ధి చేయనున్నారు. ఈ అప్ గ్రేడ్ కు సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. “సికింద్రాబాద్-విజయవాడ మార్గం దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే కారిడార్లలో ఒకటి. గుంటూరు-పగిడిపల్లి, విష్ణుపురం-మోటుమారి విభాగాలు రెండు నగరాల మధ్య కీలకమైన ప్రత్యామ్నాయ మార్గాలుగా పని చేస్తాయి. ఈ మార్గంలో మరిన్ని రైళ్లను నడపడానికి, రైల్వే ఈ విభాగాలలో ట్రాక్షన్ వ్యవస్థను 2×25 KVకి అప్ గ్రేడ్ చేయనుంది. రూ. 188 కోట్ల వ్యయంతో రాబోయే మూడు సంవత్సరాలలో ఈ పని పూర్తవుతుంది” అని వెల్లడించారు.
Read Also: పర్సును కొట్టేసిన దొంగలు, కోపంతో ఏసీ కోచ్ విండో పగలగొట్టిన మహిళ, వీడియో వైరల్!
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటా దాదాపు 337 రూట్ కి.మీ. విస్తరించి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధాని ప్రాంతాలను కలుపుతుంది. పగిడిపల్లి- గుంటూరు మధ్య ఉన్న సింగిల్ లైన్ విభాగం దేశంలోని తూర్పు ప్రాంతాల వైపు ప్రయాణీకుల కనెక్టివిటీకి చాలా ముఖ్యమైనది. అయితే, మోటుమారి-విష్ణుపురం స్ట్రెచ్ సరుకు రవాణాకు, ముఖ్యంగా బొగ్గు రవాణాకు కీలకమైన మార్గంగా కొనసాగుతుంది. ఈ స్ట్రెచ్‌ల విద్యుదీకరణ ప్రాజెక్టు పూర్తియితే, లోకోమోటివ్ మార్పులు లేకుండా సమర్థవంతమైన కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంటుంది. సరుకు రవాణాతో పాటు ప్రజా రవాణా మరింత వేగంగా కొనసాగనుంది.
Read Also: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, అదే మార్గంలో దూసుకొచ్చిన ఎక్స్ ప్రెస్..