రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో తమ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలతో పాటు లగేజీని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దొంగలు లాక్కెళ్లడం పక్కా. తాజాగా ఓ మహిళా తన చిన్న బాబుతో కలిసి ప్రయాణిస్తుండగా, దొంగ పర్సును కొట్టేశాడు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా క్విక్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సదరు మహిళ కోపంతో ఊగిపోయింది. ఏసీ కోచ్ లో ప్రయాణిస్తున్న ఆమె, పక్కనే ఉన్న విండోను పగలగొట్టే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సదరు మహిళ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళా ప్రయాణీకురాలు తను ప్రయాణిస్తున్న ఏసీ కోచ్ విండోను పగలగొట్టే ప్రయత్నం చేసింది. తోటి ప్రయాణికులు ఆమెను ఆపమని చెప్పినప్పటికీ, తన కంపార్ట్ మెంట్ కిటికి అద్దాన్ని పదే పదే కొట్టి పగలగొట్టడానికి ట్రై చేసింది. పక్కనే ఆమె బిడ్డ ఈ ఘటనను చూసి భయపడుతున్నా, పట్టించుకోకుండా ఆమె తన కోపాన్ని వెళ్లగక్కింది. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె పర్సును ఎవరో దొంగిలించారు. రైల్వే పోలీసుల సమాచారం అదించినా, వారు సాయం చేయకపోవడంతో విసుగు చెందిన ఆ మహిళ రైలు కిటికీని పగలగొట్టడం ద్వారా తన కోపాన్ని బయటపెట్టింది.
అటు ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విరిగిన రైలు విండోకు మరమ్మతులు చేసేందుకు అయ్యే ఖర్చును ఆమె నుంచి వసూళు చేయాలంటున్నారు. “పక్కన చంటి బిడ్డ ఉన్నా, ఆమె ఇలా చేయడం సరిగా లేదు. ఆ బిడ్డను ఎవరైనా పక్కకు తీయడం మంచిది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “రైల్వే ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆమె నుంచి పరిహారాన్ని వసూళు చేయాలి. ప్రయాణ సమయంలో ఎవరి వస్తువులను వారే జాగ్రత్తగా చూసుకోవాలి. రైల్వే బాధ్యత వహించదనే విషయాన్ని ముందుగా గుర్తుంచుకోవాలి” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “ఆమె మెంటల్ కండీషన్ సరిగా లేనట్టు ఉంది. అందుకే విండో బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇలాంటి వారిని జీవితాంతం ఏసీ కోచ్‌లలో ఎక్కకుండా బ్లాక్ లిస్ట్ చేయాలి. రైల్వేలో కఠినమైన నియమాలు ఉండాలి. ఆమెపై ప్రజా ఆస్తి నష్టపరిహార చట్టం కేసును ప్రయోగించాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రైల్వే ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
A woman broke a train window just because she lost her purse
And these are the same kinds of women who keep blaming the government every day for "bad facilities" and "poor infrastructure" pic.twitter.com/WVoM1MKP5T
— Saffron Chargers (@SaffronChargers) October 29, 2025
Read Also: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, అదే మార్గంలో దూసుకొచ్చిన ఎక్స్ ప్రెస్..