Upcoming Movies Theater: ప్రతినెల బోలెడు సినిమాలో థియేటర్లోకి వస్తూ ఉంటాయి. అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతి సినిమా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతోపాటుగా కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. ముఖ్యంగా కాంతార చాప్టర్ 1, డ్యూడ్ సినిమాలు 100 కోట్లకు పైగా వసూలు చేసి అక్టోబర్ నెల విన్నర్స్ గా నిలిచాయి. కాంతార 2 అయితే ఎనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.. అయితే కొన్ని సినిమాలు అక్టోబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది.
ఈ నెల చివర కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ‘మాస్ జాతర’ అక్టోబర్ 31నే విడుదలవుతున్నప్పటికీ, దాని ప్రభావం నవంబర్ నెల పొడవునా ఉంటుంది.. ఈ సినిమాతో పాటుగా కొన్ని బాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా అక్టోబర్ చివరన రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. కానీ కొన్ని కారణాలవల్ల సినిమాలో నవంబర్ కి షిఫ్ట్ అయ్యాయి. నవంబర్ నెలలో కూడా బోలెడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. నవంబర్లో ఏ సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
నవంబర్లో విడుదల కానున్న కొన్ని డీసెంట్ బజ్ ఉన్న చిత్రాలలో రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’, సుధీర్ బాబు ‘జటాధార’ ఉన్నాయి.. ఏ మూవీ ఏ డేట్ న రాబోతుందో చూద్దాం..
రష్మిక మందన్న – ది గర్ల్‌ఫ్రెండ్
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా – జటాధార
ఇమ్రాన్ హష్మి, యామీ గౌతమ్ – హక్
ప్రిడేటర్: బాడ్‌ల్యాండ్స్
తిరువీర్ – ప్రీ వెడ్డింగ్ షో..
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే – కాంత
చాందిని చౌదరి, తరుణ్ భాస్కర్ –
సంతాన ప్రాప్తిరస్తు
అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, రకుల్ ప్రీత్ సింగ్ – దే దే ప్యార్ దే 2
120 బహదూర్ – ఫర్హాన్ అక్తర్, అమితాబ్ బచ్చన్, రాశీ ఖన్నా
వికెడ్ 2 – ఇంగ్లీష్ మూవీ
ఆంధ్ర కింగ్ తాలూకా – రామ్, భాగ్యశ్రీ బోర్సే
తేరే ఇష్క్ మే – ధనుష్, కృతి సనన్
జూటోపియా 2 – ఇంగ్లీష్ సినిమా
రష్మిక మందన్న ఈ ఏడాది ఇప్పటి వరకు ఛావా, సికిందర్, కుబేరా, థామా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు థామా మూవీ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్.. ఈ సినిమాలో హీరోగా దీక్షిత్ శెట్టి నటించాడు..
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న మూవీ జటాధర.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ.. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
నవంబర్ నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్, సుధీర్ బాబు జటాధార సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ మూవీలో నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాలు ఎలాంటి టాక్ని అందుకుంటాయో చూడాలి…