MahaKali : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎప్పటికప్పుడు సినిమాలలో కొత్తదనం కనిపించేలా తెరకెక్కిస్తుంటారు.. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ ఈ మధ్య పలు సినిమాలకు దర్శకత్వం వహించారు.. కానీ ఇప్పటివరకు వాటి నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు కానీ తాజాగా ఆయన కథతో రాబోతున్న మహాకాళి చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయిన ఈ పోస్టరు జనాలను ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుంది.. ఆ పోస్టర్ ఎలా ఉందంటే.
బిగ్ బాస్ బ్యూటీ భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఆర్.కె.డి. స్టూడియ్స్ రివాజ్ రమేశ్ దుగ్గల్ తో కలిసి ‘మహా కాళీ’ మూవీని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఇప్పటికే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది.. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు.. ముఖమంతా నల్లగా రక్తం కారుతున్నట్లు అమ్మ వారి రూపంలో భయంకరంగా భూమి శెట్టి కనిపిస్తుంది. పోస్టర్ని చూస్తుంటేనే ఈ సినిమాలో అనేక ట్విస్టులు ఉంటాయని అర్థమవుతుంది. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి..
కన్నడ ఇండస్ట్రీలోని టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లో భూమిశెట్టి పాల్గొంది. ఈమె సీజన్ సెవెన్ లో పాల్గొని ఫైనలిస్ట్ గా అయ్యింది. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించి బాగా ఫేమస్ అయ్యింది. అంతేకాదు తెలుగులో కూడా ఈమె ఓ సీరియల్ లో నటించింది. జీ తెలుగులో ప్రసారమవుతున్న నిన్నే పెళ్ళాడుతా సీరియల్లో కీలకపాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.. ప్రస్తుతం సీరియల్సు సినిమాలతో బిజీగా ఉంది.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలో రాబోతున్న మహాకాళి చిత్రంలో నటిస్తుంది.. ఇందులో ఈమె మహా గా కనిపించబోతుందని గతంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశారు.. అదేగా ఈ సినిమా నుంచి ఈమె లుక్ కు సంబంధించిన పోస్టరు రిలీజ్ అయింది.. కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయిన ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ బ్యూటీ ఖాతాలో హిట్ పడుతుందని అనిపిస్తుంది.
‘మహాకాళి’ మూవీ బెంగాల్ లోని గొప్ప సాంస్కృతిక బ్యాక్ డ్రాప్ తెరకెక్కుతోంది. దానికి తగ్గట్టుగానే బెంగాల్ నగరం, హౌరా బ్రిడ్స్ ను చూపిస్తూ ఓ పోస్టర్ ను డిజైన్ చేశారు.. కాళీ దేవిని కొలిచే ఆ ప్రాంతం యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.. ఆర్.కె.డి. స్టూడియ్స్ రివాజ్ రమేశ్ దుగ్గల్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.. అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తిచేసుకుని మూవీని త్వరగా ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది..
ప్రశాంత్ వర్మ సినిమాల విషయానికొస్తే… గతంలో హనుమాన్ మూవీ తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం జై హనుమాన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులకు ఆయన సైన్ చేసినట్లు తెలుస్తుంది.