BigTV English
Advertisement

NC 24 : రికార్డు స్థాయిలో ‘NC24 ‘ ఓవర్సీస్ బిజినెస్.. చైతూ కెరీర్ లో ఇదే హైయెస్ట్..

NC 24 : రికార్డు స్థాయిలో ‘NC24 ‘ ఓవర్సీస్ బిజినెస్.. చైతూ కెరీర్ లో ఇదే హైయెస్ట్..

NC 24 : టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. రీసెంట్ గా తండేల్ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సాయి ధరంతేజ్ నటించిన విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఇది అతని 24వ సినిమా.. తండేల్ తర్వాత రాబోతున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీకి ఓవర్సీస్ హక్కులు రికార్డు స్థాయిలో నమోదైనట్లు తెలుస్తుంది.. గతంలో చైతు నటించిన ఏ సినిమాకు దక్కని హైయెస్ట్ రికార్డ్ ఇదే కావడం విశేషం. టైటిల్, ఫస్ట్ లుక్ ఏమి రిలీజ్ అవ్వక ముందే ఇలా బిజినెస్ జరగడం మామూలు విషయం కాదు. ఎన్ని కోట్లు వసూల్ చేసిందో చూద్దాం..


ఓవర్సీస్ లో చైతూ మూవీకి కళ్లు చెదిరే బిజినెస్..

అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో 24వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. తండేల్ మించిన లవ్ స్టోరీ తో ఈ మూవీ ఉండబోతుందేమో అని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ పోస్టర్ని కానీ మేకర్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే యుఎస్ లో ఈ సినిమా బిజినెస్ జరిగిపోయింది. ఓవర్సీస్ రైట్స్ 7 కోట్లకు పైగా అమ్ముడైనట్లు తెలుస్తుంది. గతంలో నాగచైతన్య నటించిన ఏ సినిమాకు ఇలాంటి బిజినెస్ జరగలేదు.. ఈ సినిమా స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే నమ్మకంతో అక్కడ డిస్ట్రిబ్యూటర్లు సినిమాని కొనేశారు. మరి వారి నమ్మకం ఒమ్ము కాకుండా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి..

Also Read : బిగ్ బాస్ 9 లో టాప్ 5 ఎవరున్నారు..? ఈ వారం ఎలిమినేట్ అతనే..?


‘NC 24’ స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీ యాక్షన్ డ్రామాగా రూపోందుతుంది. మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీలతో వస్తున్న సినిమాలకు జనాలు ఈ మధ్య నీరాజనం పలుకుతున్నారు.. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరికేక్కించిన డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. పాపులర్ స్టార్స్, టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు.. అలాగే ఈ సినిమాలో చైతు సరసన మీనాక్షి చౌదరి నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. నవంబర్ 23న నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. ఈ మూవీతో మరో హిట్ మూవీని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

Related News

Bahubali The Epic: బాహుబలి: ది ఎపిక్.. రివ్యూ పంచుకున్న స్టార్ కిడ్!

Actor Prabhu : నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు..

Sankranti -2026: సంక్రాంతి బరి నుంచి యంగ్ హీరో అవుట్… త్యాగం చేస్తున్నాడా?

PVCU MahaKali : ప్రశాంత్ వర్మ మహాకాళి గా బిగ్ బాస్ ఫైనలిస్ట్… భయంకరంగా ఫస్ట్ లుక్..

Mega 158: అంతా ఫేక్ న్యూస్… చిరు మూవీపై మరో న్యూస్

Rajamouli: బాహుబలి 3 ప్రకటించేసిన రాజమౌళి.. ఈ అనౌన్స్మెంట్ గెస్ చేయనిది!

Upcoming Movies Theater: నవంబర్ లో సినిమాల సందడి.. ఆ ఒక్కటిపైనే ఫోకస్..

Big Stories

×