Gujarat Hit & Run case: గుజరాత్‌లో ఊహించని రీతిలో హిట్ అండ్ రన్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. ఆపై కారు అతివేగంగా నడిపాడు. ఫలితంగా బైక్‌ని ఢీ కొట్టి కిలోమీటరన్నర వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
గుజరాత్‌లో హిట్ అండ్ రన్ కేసు
గుజరాత్‌లో మద్య నిషేధం. అయినా కొందరు మందు బాబులు సీక్రెట్‌గా కానిచ్చేస్తారు. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లాలో జాతీయ రహదారి 48పై మోడాసా-లునావాడ ప్రాంతాల మధ్య ఊహించిన ప్రమాదం వెలుగులోకి వచ్చింది. మనీశ్ పటేల్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. తన సోదరుడు మెహుల్ పటేల్‌తో కలిసి మద్యం తాగి కారులో ట్రావెల్ చేస్తున్నాడు. కారుని ఉపాధ్యాయుడు డ్రైవింగ్ చేస్తున్నాడు.
నార్మల్‌గా మద్యం పుచ్చుకుంటే చాలామంది కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ ఉపాధ్యాయుడికి అదే జరిగింది. ఆ హైవేపై దినేశ్‌భాయ్-సునీల్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న ఆ టీచర్ కారు.. బైక్‌ని బలంగా ఢీ కొట్టింది. ఆ ఘటన తర్వాత కారు ముందు భాగంలో ఇరుక్కుపోయింది బైక్. ఏ మాత్రం కారుని ఆపకుండా దాదాపు కిలోమీటరున్న వరకు లాక్కెళ్లాడు.
మద్యం మత్తులో టీచర్ బీభత్సం, ఒకరు మృతి
చాలా వేగంగా కారు వెళ్తోంది. ఆ తర్వాత ఓ వ్యక్తి బైక్ నుంచి కారులో ముందు భాగం నుంచి బయటపడిపోయడు. ఇంకో వ్యక్తి ఆ ముందుబాగాన్ని పట్టుకుని అలాగే ఉన్నాడు. అదే సమయంలో మరొక కారులో ఉన్న వ్యక్తులు ఈ తతంగాన్ని వీడియో షూట్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో హిట్ అండ్ రన్ వ్యవహారం బయటపడింది.
ఈ వీడియో పరిశీలించిన పోలీసులు రంగంలోకి దిగేశారు. కారు నడిపిన టీచర్ మనీశ్ పటేల్, అతడి సోదరుడు మెహుల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ కారు నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. చివరకు ఆ వాహనాన్ని సీజ్ చేశారు. బాధితులను ట్రీట్‌మెంట్ నిమిత్తం గోధ్రా సివిల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ ఒకరు మృతి చెందాడు. దినేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ALSO READ: ట్రాఫిక్ పోలీసులకు షాక్.. ఫైన్ కట్టాలని బైక్ ఆపిన యువకుడు
ప్రత్యక్ష సాక్షుల కథనాలు ప్రకారం.. హైవేపై ఉన్న ఇతర వాహనదారులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు. అరుస్తూ డ్రైవర్‌ను ఆపడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై మహిసాగర్ డీఎస్పీ కమలేశ్ నోరు విప్పారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడైన ఉపాధ్యాయుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
హిట్ అండ్ రన్ కేసు.. బైక్‌ను కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు
మద్యం మత్తులో కారు నడిపి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి కిలోమీటరుకు పైగా ఈడ్చుకెళ్లిన ఓ ఉపాధ్యాయుడు
గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లా మోడాసా-లూనావాడ రోడ్డుపై సోదరుడు మెహుల్ పటేల్‌తో కలిసి మద్యం తాగి కారులో ప్రయాణించిన మనీశ్ పటేల్… pic.twitter.com/P1Qtjou3VR
— BIG TV Breaking News (@bigtvtelugu) October 30, 2025