Thiruveer : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో తిరువీరు ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన తిరువేరు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. తిరువీరు లోని ఎంత గొప్ప నటుడు ఉన్నాడు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను చేసిన ఎన్నో పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.
అయితే ప్రస్తుతం హీరోగా కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు తిరువీర్. ఒకవైపు హీరోగా సినిమాలు చేయటం వలన మరోవైపు చాలా పెద్ద సినిమాల్లో కూడా అవకాశాలు మిస్ అయిపోయాను అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కి ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పుడు ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో హీరోగా చిన్న సినిమాలు చేయటం వేరు ప్రభాస్ సినిమాలో ఒక కీలకమైన పాత్ర చేసి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించడం వేరు.
ఇక కొన్ని సినిమాల్లో హీరోగా చేయడం వలన నటుడు తిరువీర్ చాలా అవకాశాలను ప్రభాస్ సినిమాల్లో కోల్పోయాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తిరువీరు మాట్లాడుతూ నాకు చాలా కంటిన్యూటీ షూటింగ్స్ ఉన్నాయి. నాకు హను రాఘవపూడి గారితో వర్క్ చేయడం చాలా ఇష్టం. ఆయన విజువల్స్ కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఫౌజీ సినిమా చేయడానికి కుదరలేదు.
కేవలం ఫౌజీ మాత్రమే కాదు మరోవైపు సలార్ సినిమా కూడా నాకు మిస్ అయిపోయింది. సలారు సినిమాలోని కాటేరమ్మ ఫైట్ యాక్టర్ ఉన్నారు కదా అది యాక్చువల్ గా నేనే చేయాల్సిందే. ఈ సినిమాలో నేను మిస్ అయినందుకు చాలా బాధగా అనిపిస్తుంది. అలానే మనకు ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది. ఏది వస్తే అది మనది అని ఫీల్ అవుతాను.
తెలుగులో తిరువీరు నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నటుడుగా ప్రూవ్ అయిపోయాడు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించాలి అంటే ప్రభాస్ సినిమాలో ఆ పాత్రలు చేసి ఉంటే నటుడుగా నెక్స్ట్ లెవెల్ గుర్తింపు వచ్చేది అనేది చాలామంది అభిప్రాయం.
Also Read: Samantha: క్రేజీ కాంబినేషన్ రిపీట్, నందిని సమంతకు ఈ సినిమా హిట్ కీలకం కీలకం