Mass Jathara Trailer: రవితేజ నుంచి ప్రేక్షకులు కోరుకునేది మంచి ఎంటర్టైన్మెంట్. అందుకనే రవితేజ ఎన్ని కాన్సెప్ట్ సినిమాలు చేసినా కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు కమర్షియల్ గా ప్రేక్షకులను అలరించడానికి మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు రవితేజ. ఈ సినిమాను అక్టోబర్ 31న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేశారు.
నవీన్ చంద్ర ఎంట్రీ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది. నేను రైల్వే పోలీస్ కాదు క్రిమినల్ పోలీస్ అనే రవితేజ చెప్పే డైలాగ్ హైలెట్. ఒక మాస్ డైలాగ్ తర్వాత కామెడీ ఎంటర్టైన్మెంట్ మొదలైంది. వెంకీ సినిమాలోని ట్రైన్ సీన్ లో డైలాగ్ మళ్లీ మాస్ జాతరలో కూడా పెట్టారు. ఇడియట్ సినిమాలోని బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో గమనించవచ్చు. శ్రీ లీల ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసను మాట్లాడుతుంది. ఈ క్యారెక్టర్ తనకు మంచి ప్లస్ అవుతుంది అని చెప్పొచ్చు. అన్నింటిని మించి జనగణమన ఎవరు రాశారు అనే రవితేజ అడిగినప్పుడు. పూరి జగన్నాథ్ అని వేరే వాళ్ళు చెప్పడం హైలెట్.
ట్రైలర్ చూస్తుంటే రవితేజ అభిమానులు ఏదైతే తన నుంచి కోరుకుంటారో, వాటన్నిటిని దర్శకుడు భాను పుష్కలంగా ఈ సినిమాలో పొందుపరిచాడు అనిపిస్తుంది. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి అని అర్థమవుతుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కాలేదు. ఆ సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు వర్కౌట్ అయ్యేలా అనిపిస్తుంది.
Also Read: Samantha: క్రేజీ కాంబినేషన్ రిపీట్, నందిని సమంతకు ఈ సినిమా హిట్ కీలకం కీలకం