Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న దిల్ రాజు(Dil Raju)ఇటీవల కాలంలో తన బ్యానర్ నుంచి వస్తున్న సినిమాల విషయంలో తన జడ్జిమెంట్ తప్పిపోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు తన నిర్మాణ సంస్థలో 50కి పైగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. ఇలాంటి దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే కచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకం అందరిలో ఉండేది కానీ ఇటీవల దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.
ఇటీవల దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన గేమ్ చేంజర్, తమ్ముడు లాంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దిల్ రాజు తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఇకపోతే దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Indraganti Mohan Krishna)దర్శకత్వంలో “జఠాయు” (Jatayu)సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ ఇతిహాసాల్లో ఒకటిగా నిలిచిన రామాయణం ఆధారంగా ఈ సినిమా చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాకు మొదటి ఎంపికగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అయితే కరెక్ట్ గా సూట్ అవుతుందని దిల్ రాజు భావించినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ నుంచి సానుకూల స్పందన లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలకు కమిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా నుంచి ప్రభాస్ తప్పుకోవడంతో ఈ కథ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) వద్దకు వెళ్ళింది. ఇలా విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అభిమానులందరూ భావించారు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండను దిల్ రాజు సైడ్ చేసి రంగంలోకి మరొక యంగ్ హీరోని దించబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ స్థానంలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ (Roshan)ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం.
రౌడీ జనార్దన్ గా విజయ్ దేవరకొండ..
ఇటీవల కాలంలో యంగ్ హీరోలు ఈ తరహా సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంటున్న నేపథ్యంలో ఈ జఠాయు సినిమాలో కూడా విజయ్ దేవరకొండ కాకుండా రోషన్ అయితే సరిగ్గా సెట్ అవుతారని దిల్ రాజు భావించారట. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అది త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని సమాచారం. ఇక రోషన్ ఇప్పటికే హీరోగా పలు సినిమాలలో నటించారు. త్వరలోనే ఈయన హీరోగా నటించిన ఛాంపియన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాని డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదలైన అనంతరం జఠాయు పనులలో రోషన్ బిజీ కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండ దిల్ రాజు బ్యానర్ లో మరొక సినిమాను ప్రకటించారు. రౌడీ జనార్దన్ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Hyper Aadi: సీరియల్ నటిపై హైపర్ ఆది బాడీ షేమింగ్ .. బండ ఆంటీ అంటూ!