Ustaad Bhagat Singh : మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. పాలమ్మిన పూలమ్మిన అనే ఒకే ఒక్క డైలాగుతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ డైలాగుతో రీల్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒక్క డైలాగ్ తన జీవితాన్ని మార్చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఆయన యూత్ కి పోటీ ఇచ్చేలా డాన్స్లు కూడా వేయడంతో జనాలు మల్లారెడ్డికి ఫాన్స్ గా మారిపోయారు. అయితే ఈయన ఆ మధ్య సినిమాల్లో నటిస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఓ సినిమాని రిజెక్ట్ చేశాడంటూ ఓ వార్త సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఆయన రిజెక్ట్ చేసిన సినిమా మరెవరిదో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ మూవీనే.. అసలు ఆయన ఆ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరో, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఒకవైపు రాజకీయాల్లోనూ మరోవైపు కమిటీని సినిమాలను పూర్తిచేసే పనిలో పవన్ కళ్యాణ్ నిమగ్నమాయ్యారు. రీసెంట్ గా ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయాన్నీ సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. ఈ సినిమా కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ పాపులర్ పొలిటీషియన్ మల్లారెడ్డిని సంప్రదించాడని వార్తలు కూడా వచ్చాయి. ఉస్తాద్ భగత్ సింగ్‌లో విలన్ రోల్ కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ తనను కలిశాడని మల్లారెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది.
మల్లారెడ్డి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఆయన సినిమా చేస్తే బాగుండు అని చాలామంది అభిమానులు కూడా కోరుకుంటున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ 3 కోట్ల రెమ్యూనరేషన్తో మంచి ఆఫర్ ని ఆయనకు ఇచ్చిన సరే అందుకు నో అనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం కూడా ఉందని మాజీ మంత్రి ఇంటర్వ్యూలో బయటపెట్టారు. తనకు విలన్ పాత్ర అంటే అంత సౌకర్యవంతంగా ఉండదని హరీష్‌కు చెప్పానన్నాడు. ఇంటర్వెల్ దాకా నేను హీరోను తిడుతుంటా.. ఇంటర్వెల్ తర్వాత హీరో నన్ను దూసిస్తాడు.. కొడతాడని చెప్పుకొచ్చాడు.. అందుకే ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఆఫర్ ని ఈయన వదులుకున్నారంటూ కొందరు అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది అటు రాజకీయపరంగా కూడా హాట్ టాపిక్ గా మారింది.
Also Read :హీరో కార్ల కలెక్షన్స్ కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..ఫెర్రారీ నుండి ల్యాండ్ రోవర్..
భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. భారీ హైప్ ను క్రియేట్ చేస్తుంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఈ చిత్రంలో విలన్ గా జే మహేంద్రన్ నటిస్తున్నారు. హీరోయిన్ గా టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..