Panjabi singer-Actor Rajvir Jawanda: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రముఖ పంజాబీ సింగర్, నటుడు రాజ్వీర్ జవందా (35) ఇవాళ కన్నుమూశారు. కాగా గత నెల సెప్టెంబర్ 27న ఆయన తన మోటారు సైకిల్పై సిమ్లా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీ వద్ద ఆయన బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. విషమ పరిస్థితిలో ఉన్న ఆయనకు వైద్యులు అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
కొద్దిరోజులుగా వెంటిలెటర్పైనే రాజ్వీర్కి చికిత్స పోందుతున్న క్రమంలో పరిస్థితి విషమించడంతో బుధవారం (అక్టోబర్ 8) ఉదయం కన్నుమూశారు. రాజ్వీర్ జవందా మరణంతో పంజాబీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మరణంపై సీని ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా గత నెల బైక్ పర్యటనకు వెళ్లిన రాజ్‌వీర్ హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్పీడుగా వెళ్తున్న ఆయన బైక్‌కి ఆకస్మాత్తుగా పశువుల మంద అడ్డు వచ్చింది. దీంతో అదుపుతప్పి కింద పడ్డా రాజ్‌వీర్.. తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన తల భాగం, వెన్నుముక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.
ఆయన వెన్నుముక విరగడంతో అలాగే శరీరంలో వివిధ భాగాల్లో గాయాలు అయ్యాయి. విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చేరిన అతడిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినట్టు ఆస్పత్రి వర్గాల తెలిపాయి. “గత పదిరోజులుగా రాజ్‌వీర్ వెంటిలెటర్‌పైనే ఉన్నారని, ఆయన ట్రీట్మెంట్‌కి స్పందించడం లేదని చెప్పారు. తల భాగం దెబ్బ తినడం వల్ల ఆయన నాడీ వ్యవస్థ దెబ్బతిందని, పనితీరు తగ్గడంతో వైద్యానికి స్పందించలేకపోయారు. విషమ పరిస్థితిలో ఆస్పత్రి చేరిన ఆయనను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించాం. కానీ, ఫలితం లేకపోయింది. వెంటిలెటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్యం విషమించి నేడు ఉదయం తుదిశ్వాస విడి చారు” అంటూ ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.
Also Read: Ravi Teja: మాస్ జాతర సాంగ్‌పై ట్రోల్స్.. ఎట్టకేలకు స్పందించిన రవితేజ, ఏమన్నారంటే
కాగా 2014లో సింగర్గా పంజాబీ పరిశ్రంలో అడుగుపెట్టారు రాజ్వీర్. సర్నేమ్, కమ్లా, మేరా దిల్, సర్దారీ వంటి పాటలతో పాపులర్ అయ్యారు. సింగిల్ ముండే లైక్ మీ పాటతో ఆయన ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఈ సాంగ్ ఎంతటి విజయ్ సాధించిందో తెలిసిందే. యూట్యూబ్లో, ఈవెంట్స్ మారుమ్రోగింది. అలా తనైదన గాత్రంతో ఎన్నో పంజాబీ లోకల్ సాంగ్స్ పాడి ఎంతోమంది సంగీత ప్రియులను అలరించారు. అలా అతి తక్కువ కాలంలో రాజ్వీర్ స్టార్ సింగర్గా ఎదిగారు. గాయకుడిగానే కాదు నటుడిగాను వెండితెరపై తనదైన ముద్ర వేసుకున్నారు. గిప్పి గ్రెవల్, సుబెదర్ జోగిందర్ సింగ్ వంటి చిత్రాలల్లో కీలక పాత్రలు పోషించారు ఆయన.