BigTV English

Tollywood: టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా నిలిచిన స్టార్ హీరోలు వీళ్లే!

Tollywood: టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా నిలిచిన స్టార్ హీరోలు వీళ్లే!

Tollywood: నిత్యం మనం చూసే స్టార్ హీరోలు సినిమాలలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా గొప్ప స్నేహ బంధాన్ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా సినిమాలతో నిత్యం బాక్సాఫీస్ వద్ద పోటీపడే ఈ హీరోలు రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం మీకు తెలుసా..? మరి ఈరోజు అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్న హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.


మోహన్ బాబు – రజనీకాంత్ :

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ (Rajinikanth), టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు (Mohanbabu) మధ్య ఎన్నో సంవత్సరాల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు ఉన్నాయి. అంతేకాదు కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా కూడా నిలబడ్డారు. అలా రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా మంచి ఫ్రెండ్షిప్ ను మెయింటైన్ చేస్తున్నారు. అంతేకాదు ఎన్నో సందర్భాలలో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు.


చిరంజీవి – నాగార్జున :

గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ సీనియర్ హీరోలుగా పేరు తెచ్చుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఒకరు. సినీ ప్రియులను అలరిస్తున్న వీరిద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. కానీ కలిసి అన్ని విషయాలు పంచుకుంటారు. బిజినెస్ చేయడమే కాదు ఒకరికొకరు తోడుగా కూడా నిలుస్తున్నారు. చిరంజీవి నాకు బ్రదర్ లాంటి వాడు అని నాగార్జున ఎన్నో సందర్భాలలో స్వయంగా తెలియజేశారు.నాగార్జున సలహాతో తాను ఎన్నో వ్యాపారాలలో పెట్టుబడి పెట్టినట్లు చిరంజీవి స్వయంగా తెలిపారు. అలా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గా పేరు సొంతం చేసుకున్నారు.

మహేష్ బాబు – రామ్ చరణ్ – ఎన్టీఆర్:

స్నేహానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు ఈ ముగ్గురు హీరోలు. వయసులో వీరి ముగ్గురికి చాలా తేడా ఉన్నా.. వీరి మధ్య మంచి స్నేహం కుదిరింది. తరచూ ఫ్యామిలీతో కలిసి పార్టీలు చేసుకోవడమే కాకుండా షూటింగ్స్ లో ఉంటే లొకేషన్స్ కి వెళ్లి మరీ ముచ్చటిస్తూ ఉంటారు. ఒకరిపై ఒకరు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తారు. అటు వీరే కాదు వీళ్ళ సతీమణులు కూడా ఫ్రెండ్స్ గా మారిన విషయం తెలిసిందే.

రానా దగ్గుబాటి – రామ్ చరణ్:

వీరి బంధం స్కూల్ నుంచే మొదలయ్యింది. ఒకరి ప్లేట్లో ఒకరు తినే అంత గట్టి స్నేహం వీరి మధ్య ఉంది.. కెరియర్ లో ఎవరికి వారు బిజీగా ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం కలుసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ప్రభాస్ – గోపీచంద్ :

ప్రభాస్(Prabhas )- గోపీచంద్(Gopichand).. వీరిద్దరూ కూడా రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్.. రెగ్యులర్గా టచ్ లో ఉంటారు. ఒకరికొకరు అండగా నిలుస్తూ ఉంటారు. గోపీచంద్ ను హీరోగా నిలబెట్టడానికి ప్రభాస్ తన వంతు ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇటీవలే బాలయ్య అన్ స్టాపబుల్ షో కి కలిసి హాజరై ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

నితిన్ – అఖిల్ :

అక్కినేని అఖిల్ (Akkineni Akhil)కి, నితిన్ (Nithin) మంచి ఫ్రెండ్స్. ఇండస్ట్రీలోకి అఖిల్ రాకముందు నుంచే వీరి మధ్య స్నేహం ఉంది. నితిన్ తన సొంత బ్యానర్ లో అఖిల్ ను హీరోగా పరిచయం చేశారు. అయితే సాధ్యమైనంతవరకు వీళ్ళిద్దరూ కలిసి బయట కనిపించకపోవడం గమనార్హం.

వీరే కాకుండా.. మహేష్ బాబు – సుమంత్, రామ్ చరణ్ – శర్వానంద్, ప్రభాస్ – రానా, అల్లరి నరేష్ – నాని, మంచు మనోజ్ – సాయి ధరంతేజ్, విజయ్ దేవరకొండ – నవీన్ పోలిశెట్టి, వరుణ్ తేజ్ – నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్- నాగశౌర్య, ఎన్టీఆర్ – అల్లు అర్జున్, రామ్ చరణ్ – ఎన్టీఆర్ ఇలా ఎంతోమంది బెస్ట్ ఫ్రెండ్స్ గా నిలిచారు.

ALSO READ:The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుది గడువు అప్పుడే!

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×