BigTV English

Gali Kireeti Reddy: గాలి కిరీటి రెడ్డి ఆస్తులు విలువ ఎంతో తెలుసా… సినిమాలు అవసరమా భయ్యా?

Gali Kireeti Reddy: గాలి కిరీటి రెడ్డి ఆస్తులు విలువ ఎంతో తెలుసా… సినిమాలు అవసరమా భయ్యా?

Gali Kireeti Reddy: ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) కుమారుడు గాలి కిరీటి రెడ్డి(Gali Kireeti Reddy) సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈయన జూనియర్(Junior) అనే సినిమా ద్వారా వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా జూలై 18 వ తేదీ తెలుగు కన్నడ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవల బెంగళూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక ఇందులో నటి శ్రీ లీల(Sreeleela) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.


ట్రెండింగ్ లో వైరల్ వయ్యారి…

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ భారీ స్థాయిలో సినిమాపై అంచనాలను పెంచేసింది. సినిమా నుంచి విడుదలైన
“వైరల్ వయ్యారి” అనే పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరీటి రెడ్డి ఆస్తుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నాయకుడైన గాలి జనార్దన్ రెడ్డి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న గాలి కిరీటి రెడ్డి ఆస్తులు గురించి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. గాలి జనార్దన్ రెడ్డి వారసుడిగా మీకు 5000 కోట్ల వరకు ఆస్తులు ఉంటాయని సమాచారం అంతకంటే ఎక్కువగానే ఉన్నాయా అంటూ ప్రశ్న ఎదురయింది.


పెద్దగా ఆస్తులు లేవు..

ఈ ప్రశ్నకు కిరీటి రెడ్డి సమాధానం చెబుతూ.. నిజానికి మా ఆస్తులు గురించి బయటకు వచ్చింది ఏమాత్రం నిజం కాదని, అందరూ దృష్టిలో మాకు వేల కోట్లు ఉన్నాయని మాత్రమే తెలుసు నిజానికి అంత లేదని ఈయన తెలిపారు. అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా మా ఆస్తుల గురించి అలాంటి వార్తలను సృష్టించబడ్డాయని తెలిపారు. నిజానికి మాకి అన్ని ఆస్తులు లేవని మాకు బళ్లారిలో ఒక ఇల్లు ఉంది అలాగే బెంగళూరులో ఒక అపార్ట్మెంట్ ఉందని, ఇంతకుమించి మాకు ఎలాంటి ఆస్తులు లేవు అంటూ కిరీటి రెడ్డి తెలిపారు. ఇలా తమకు ఆస్తులు లేవు అంటూ కిరీటి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

జూనియర్ కోసం టాప్ టెక్నీషియన్లు..

ఇక జూనియర్ విషయానికి వస్తే.. వ్యాపార రంగంలోనూ రాజకీయాలలో పేరు ప్రఖ్యాతలుగాంచిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సినిమాపై ప్యాషన్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చానని కిరీటి రెడ్డి తెలిపారు. ఇక ఈయనకి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న నటుడిగా నటించారని ఇదివరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు అందరు కూడా రంగంలోకి దిగారని తెలుస్తోంది. రాజమౌళి సినిమాలకు పని చేసే సెంథిల్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో వారాహి నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ జెనీలియా(Genelia) కూడా భాగమైన సంగతి తెలిసిందే.

Also Read: Prabhas: స్పిరిట్ షూటింగ్ స్టార్ట్… సెట్స్ లో ప్రభాస్… వీడియో వైరల్

Related News

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Balakrishna: అఖండ 2 రిలీజ్ పై బాలయ్య క్లారిటీ.. సోషల్ మీడియాపై మండిపాటు!

OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Prabhas: ప్రభాస్‌కి ఏం తెలీదు… డార్లింగ్‌ను తేజ సజ్జా అలా అన్నాడేంటి ?

Big Stories

×