Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలోనే ప్రభాస్ ది రాజా సాబ్(The Raja Saab) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ త్వరలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ నుంచి షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి అంటూ ఇటీవల సందీప్ రెడ్డివంగా సోదరుడు సినిమా గురించి బిగ్ అప్డేట్ తెలియజేశారు.
స్పిరిట్ షూటింగ్ లో ప్రభాస్..
ఇకపోతే తాజాగా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో పాల్గొన్నట్టు స్వయంగా ప్రభాస్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ..”డార్లింగ్స్… స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. మహా అయితే టూ ఇయర్స్ ఇంకా” అంటూ ఈ సినిమా షూటింగ్ గురించి అప్డేట్ ఇస్తూ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసినా అభిమానులు ఒకింత సంతోషం వ్యక్తం చేసినప్పటికీ, నిజంగానే ప్రభాస్ ఇలాంటి వీడియో చేసి ఉంటే ఇంకా ఆనందపడే వాళ్ళం అంటు కామెంట్లు చేస్తున్నారు.
ఏఐ మహిమ…
ఇక ఇటీవల ఏఐ టెక్నాలజీ (AI Technology) వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలు తెగ చక్కర్లు కొడుతున్నాయి ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకొని పరిస్థితులలో ఉన్నారు. తాజాగా ఈ వీడియో ప్రభాస్ చేసింది కాదని ఏఐ ద్వారా రూపొందించిందని స్పష్టమవుతుంది. ఇక సినిమా షూటింగ్ ప్రారంభం కావాలి అంటే మరికొన్ని నెలలు పాటు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం సందీప్ రెడ్డి ఈ సినిమాలో నటీనటుల ఎంపికతో పాటు ఇతర వ్యవహారాలు చూసుకుంటూ బిజీగా ఉన్నారు.
ఇక ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఆ ముందుకు రాబోతుంది. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటివరకు అధికారక ప్రకటన మాత్రం వెలబడలేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా దీపికా పదుకొనేను ఎంపిక చేసినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో తిరిగి యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి(Tripti Dimri) ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా పనులతో పాటు, హనురాగవపూడి డైరెక్షన్లో రాబోతున్న ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. వీటితో పాటు ఈయన కల్కి, 2, సలార్ 2 సినిమాలకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఇక ప్రభాస్ చివరిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఇటీవల మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో నిద్ర పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Sreeleela: హిట్లు లేవు.. క్యూ కడుతున్న ఆఫర్స్.. మరో బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన నటి ?