BigTV English

Telugu Heroes : రెమ్యునరేషన్‌కి న్యాయం చేయడంలో ఫెయిల్… ఈ జనరేషన్‌ హీరోలకు బ్యాడ్ నేమ్!

Telugu Heroes : రెమ్యునరేషన్‌కి న్యాయం చేయడంలో ఫెయిల్… ఈ జనరేషన్‌ హీరోలకు బ్యాడ్ నేమ్!

Telugu Heroes : ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమాతో ఒక హీరో మంచి సక్సెస్ అందుకున్నారు అంటే.. తన తదుపరి సినిమాకి రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తుంటారు. అయితే అలా తీసుకున్న రెమ్యూనరేషన్ కి తదుపరి సినిమాతో కూడా న్యాయం చేశారా అంటే చెప్పలేని పరిస్థితి. ఒకరకంగా చెప్పాలి అంటే ఇలా తీసుకున్న పారితోషకానికి న్యాయం చేయడంలో సీనియర్ హీరోలే బెటర్ అని నిరూపిస్తున్నారు. అంతేకాదు ఈ జనరేషన్ హీరోలు తాము తీసుకుంటున్న పారితోషకానికి పెద్దగా న్యాయం చేయడం లేదు అని కూడా తెలుస్తోంది.


రెమ్యునరేషన్ కి న్యాయం చేయడంలో వారే బెటర్..

అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. ఇలా రెమ్యూనరేషన్ కి న్యాయం చేయడంలో ఓల్డ్ జనరేషన్ హీరోలే బెటర్ ఏమో అనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ). ఈ వయసులో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో భాగంగానే అటు వరుస సినిమాలు ప్రకటిస్తూ.. మరొకవైపు రెమ్యూనరేషన్ పెంచేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. చిరంజీవి తన వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటూ ఇప్పుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చేయబోతున్న మెగా 157 సినిమాకి ఏకంగా రూ.75 కోట్లు తీసుకుంటున్నారు.


అటు బాలకృష్ణ (Balakrishna) కూడా రాబోయే తన తదుపరి చిత్రానికి ఏకంగా రూ. 35 కోట్లు తీసుకోబోతున్నట్లు సమాచారం.

అటు త్రివిక్రమ్ (Trivikram ) దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి వెంకటేష్ రూ.35 కోట్లు తీసుకుంటే.. చిరు సినిమాలో కామెడీ పాత్ర చేయడం కోసం ఏకంగా రూ.15 కోట్లు తీసుకుంటున్నారు వెంకటేష్.

అంతేకాదు ఇటు నాగార్జున కూడా తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి న్యాయం చేస్తున్నారు. ఇటీవల కుబేర సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించారు. ఆ సినిమాకి ఆయన ఏకంగా రూ.20 కోట్లు తీసుకున్నారు.

ఇలా మొత్తానికి అయితే ఈ హీరోలంతా కూడా వర్త్ వర్మ వర్త్ అనిపిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే వారు తీసుకునే రెమ్యూనరేషన్ కి తమ పాత్రలతో ఖచ్చితంగా న్యాయం చేస్తూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటున్నారు..

రెమ్యూనరేషన్ కి న్యాయం చేయడంలో యంగ్ జనరేషన్ ఫెయిల్..

కానీ నేటితరం హీరోలు మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం అనే చెప్పాలి. ఇటీవల వచ్చిన జాక్ (Jack). సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా.. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పైగా సిద్దు ఈ సినిమా కోసం రూ.4కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. కానీ ఆకట్టుకోలేక పోయారు.

దీనికి తోడు నితిన్ (Nithin).. ఇటీవల ‘తమ్ముడు’ మూవీ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇందులో సీనియర్ హీరోయిన్ లయ (Laya) కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. అక్క తమ్ముడు సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అటు దిల్ రాజు ఈ సినిమాను రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. కనీసం రూ.5 కోట్లు కూడా ఈ సినిమా రాబట్ట లేకపోయింది. దీన్ని బట్టి చూస్తే యంగ్ హీరోలు ఈ జనరేషన్లో తాము తీసుకున్న రెమ్యూనరేషన్ కి ఏ మేర న్యాయం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఓల్డ్ జనరేషన్ న్యాయం చేసినంత న్యూ జనరేషన్ న్యాయం చేయలేకపోతున్నారని స్పష్టమవుతోంది.

ALSO READ:War 2 Story Leak: వార్ 2 స్టోరీ లీక్.. వార్నీ ఇన్నాళ్లు ఎన్టీఆర్ ను విలన్ ను చేశారు కదరా?

Related News

Boney Kapoor: ‘శివగామి‘ పాత్ర వివాదం.. శ్రీదేవిని అవమానపరిచారు.. పెదవి విప్పిన బోనీ కపూర్

OG: ఓజీపై తమన్ బిగ్ అప్డేట్.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ!

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Big Stories

×