Ravi Teja Next:ఇరుముడి..మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి స్ప్రుష్టిస్తుంది. ఇప్పటికే ఏకంగా 230కోట్ల వసూల్లని కొల్లగొట్టి మరో ఆరు రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి కూడా రెడీ అయిపొయింది.
అయితే వరుసగా ఆరు ఫ్లాపులని మూట గట్టుకున్న రవితేజకి ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ అంతా ఇంతా కాదు. ఇపుడు ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో ఇపుడు మరిన్ని సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.
గోపి చంద్ మలినేని తో మరోసారి
ఈ క్రమం లోనే ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ఒక సినిమాకి, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ మహారాజ ఇపుడు తనకి అచ్చొచ్చిన డైరెక్టర్ తో జత కట్టబోతున్నాడన్న టాక్ వినిపిస్తుంది. అవును..డాన్ శీను’. ‘బలుపు’ ‘క్రాక్’అంటూ సాలిడ్ హ్యాట్రిక్ అందించిన గోపి చంద్ మలినేని తో మరోసారి జత కట్టబోతున్నాడన్న టాక్ వినిపిస్తుంది.
బాలకృష్ణతో భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’
ఇలా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రవితేజ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన దర్శకుడితో జతకట్టబోతుండటం ఇపుడు ఫిలిమ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం గోపీచంద్ మలినేని నందమూరి బాలకృష్ణతో భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’ తెరకెక్కిస్తున్నారు. గతంలో బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ చేసిన గోపీచంద్ మలినేని మరోసారి అదే కాంబినేషన్‌లో పనిచేస్తుండటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
2027 చివర్లో లేదా 2028 మొదట్లో
‘దాదా’ పనులు పూర్తయిన తర్వాత రవితేజతో చేయబోయే సినిమాపై గోపీచంద్ మలినేని ఫోకస్ పెట్టబోతున్నాడని తెలుస్తుంది.ఇక ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే 2027 సమ్మర్ లో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2027 చివర్లో లేదా 2028 మొదట్లో కాని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
‘ఈ స్పీడ్ ఏంటి రవితేజా?’
మొత్తంగా ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో స్పీడ్ మీదున్న రవి తేజని చూసి ‘ఈ స్పీడ్ ఏంటి రవితేజా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.ఒకవైపు కొత్త దర్శకులతో సినిమాలు.. మరోవైపు హిట్ కాంబినేషన్లను రిపీట్ చేస్తూ స్ట్రాటజీలు .. ఇలా కెరీర్‌ను మాత్రం ఫుల్ బిజీగా ఉంచేస్తున్నాడు.అయితే ఈసారి కథ ఎలా ఉండబోతోంది? రవితేజను మళ్లీ పోలీస్ క్యారెక్టర్‌లోనే చూపిస్తారా? లేక ‘బలుపు’, ‘క్రాక్’లకు పూర్తి భిన్నంగా కొత్త బ్యాక్‌డ్రాప్‌లోకి తీసుకెళ్తారా? అనేది సినిమా మొదలైతే కాని తెలిసేలా లేదు.
ALSO READ:67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!
చూడాలి మరి ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న సక్సెస్ ని ఇరుముడి తో అందుకున్న రవితేజ రాబోయే సినిమాలతో ఆ సక్సెస్ స్ట్రీక్ ఎలా కంటిన్యూ చేస్తాడో !