E-Paper
Advertisement

VK Naresh : నరేష్ బర్తడే స్పెషల్.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పవిత్ర.. ఫోటోలు వైరల్!

VK Naresh : నరేష్ బర్తడే స్పెషల్.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పవిత్ర.. ఫోటోలు వైరల్!
Advertisement

VK Naresh : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు వీకే నరేష్ (VK Naresh). ఒకరకంగా చెప్పాలి అంటే సినిమాల కంటే ఈమధ్య తన వ్యక్తిగత విషయాల కారణంగానే భారీగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రముఖ నటి పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) తో పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తూ వార్తల్లో నిలిచిన ఈయన.. ఇటీవల ఒక సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొని.. పవిత్ర లోకేష్ తన సర్వస్వమని, ఆమె వల్లే తన జీవితంలో సక్సెస్ చూస్తున్నాను, ఆమె తన లక్కీ ఛార్మ్ అంటూ తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉండగా జనవరి 20న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా జరిగిన వేడుకలలో పవిత్ర లోకేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

నరేష్ బర్తడే వేడుకలు.. అట్రాక్షన్ గా నిలిచిన పవిత్ర..

ఇకపోతే వీకే నరేష్ తాజాగా ‘ నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. శర్వానంద్ , సాక్షి వైద్య, సంయుక్త మేనన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ‘శుభకృత నామ సంవత్సరం’ అనే కన్నడ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇలా ఒకవైపు సినిమాలతో మరింత బిజీగా మారిపోయారు నరేష్. ఇదిలా ఉండగా జనవరి 20న ఆయన 54 పుట్టినరోజు
ఈ వేడుకను ఆయన చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ బర్తడే వేడుకలలో సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. హీరో శర్వానంద్, జయసుధ, రవిబాబు, నారా రోహిత్ లాంటి పలువురు సినీ తారలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వేడుక చాలా గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది

గజమాలతో సత్కారం..

Advertisement

తాజాగా బయటకు వచ్చిన ఫోటోలలో, వీడియోలలో పవిత్ర లోకేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వేదిక పైన నరేష్ తో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. అందరి దృష్టిని ఆకర్షించింది . ఇకపోతే ఈ సందర్భంగా వీరిద్దరిని గజమాలతో సత్కరించడం మరింత హైలెట్ గా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో అభిమానులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

also read:Bollywood: “కాల్పులు జరిపింది నేనే”.. నిజం ఒప్పుకున్న ప్రముఖ నటుడు అరెస్ట్!

వీకే నరేష్ వ్యక్తిగత జీవితం..

Advertisement

దివంగత దర్శకురాలు, విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నరేష్.. జంధ్యాల దర్శకత్వంలో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలలో నటించి మంచి పేరు అందుకున్నారు. ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. మొదట సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. రెండో పెళ్లి చేసుకున్నాక అది కూడా విడాకులు వరకు వచ్చింది. ఇక మూడవ పెళ్లి 50 ఏళ్ల వయసులో జరిగింది . ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడైన రఘువీరారెడ్డి సోదరి కుమార్తె రమ్యను 2010 డిసెంబర్ 3న హిందూపురంలో వివాహం చేసుకున్నారు. అయితే ఈమెకు విడాకులు ఇవ్వకుండానే 2023 నుండి నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×