Megastar Chiranjeevi: ఏ విషయం ఎప్పుడూ ప్రస్తావన లోనికి వస్తుందో ఎవరు ఊహించలేరు. ఈటీవీ విన్ లో రీసెంట్గా విడుదలైన AIR వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ లో కొన్ని సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ ని పోగేసి ఒక రూమ్ లో అబ్బాయి స్పీచ్ బాగా వైరల్ అయింది. దానివలన చాలామంది మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే దానిలో ఒక డైలాగ్ గట్టిగా వినిపిస్తుంది. విషమైన తాగుదాం. కానీ ఆ హీరో ప్రమోట్ చేసిన ఆ బ్రాండ్ కూల్ డ్రింక్ మాత్రం తాగకూడదు అని చెప్తాడు.
ఇక్కడతో కొత్త విషయం తెర మీదకు వచ్చింది. వాస్తవానికి ఇది ఎప్పుడో జరిగిన విషయం చాలామంది కూడా మర్చిపోయారు. కానీ ఈ సినిమాలో ఇది గుర్తు చేయటం వలన మరోసారి ఈ టాపిక్ వైరల్ గా మారింది.
కాలేజీలో ఆ బ్రాండ్ బ్యాన్
ఇంతకు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన కూల్ డ్రింక్ తంసప్. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి తంసప్ యాడ్స్ బాగా పాపులర్ అయ్యేవి. చాలామంది కూడా మెగాస్టార్ అంబాసిడర్ గా చేసిన ఈ బ్రాండ్ ను ఆదరించారు. అయితే గుంటూరులో ఒక కాలేజీకి చెందిన చాలామంది మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. కాబట్టి మనం దీనిని బ్యాన్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఇదంతా కూడా కేవలం ఒక వర్గానికి చెందిన వాళ్లు అని అందరికీ తెలిసిన విషయమే. ఆ కాలేజీలో ఎక్కువ శాతం మంది అదే వర్గం వాళ్ళు ఉండడంతో ఆ క్యాంటీన్లో థమ్సప్ కూడా అమ్మేవాళ్ళు కాదు.
వేరే కాలేజీలో ఆ బ్రాండ్ మాత్రమే
ఇక గుంటూరులో ఉన్న మరో కాలేజీలో మెగాస్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం వలన కేవలం అదే కూల్ డ్రింక్ ను మాత్రం అమ్మేవాళ్ళు. అదే తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ చేసేవాళ్ళు. పెప్సీ తర్వాత ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఒక అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించలేదు.
చిరంజీవి రియాక్షన్
గతంలో ఒక షోలో చిరంజీవికి ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా మెగాస్టార్ ఈ విధంగా చెప్పుకొచ్చారు.ఆ కూల్ డ్రింక్ తాగుతున్నారు అంటే చాలామంది అభిమానులు చిరంజీవి తాగుతున్నారు, కాబట్టి మనం తాగాలి అని అనుకోవచ్చు. కానీ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు, కాబట్టి మనం తాగకూడదు అనుకోవడం దురాభిమానం. అది హర్షింపదగ్గది కాదు. ఇతర హీరోలుకు కూడా అభిమానులు ఉండొచ్చు. అవతలి వాళ్ళని ద్వేషించడం అనేది అనాగిరికం.
మొత్తానికి ఈ వెబ్ సిరీస్ వలన ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది.
Also Read : అక్కడ కాస్ట్ ఫీలుంది, జగపతిబాబు నవదీప్ పాత వీడియోలు వైరల్