లండన్ లోని హిస్టారికల్ ‘ది రాయల్ ట్రైన్’ త్వరలో తన సేవలకు ముగింపు పలకనుంది. నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విక్టోరియా మహారాణి హాయాం నుంచి అంటే 1869 నుంచి ఈ రైలు సేవలను అందిస్తున్నది. బ్రిటన్ రాజ కుటుంబీకులు ఈ రైలును ఉపయోగించేవారు. విలాసవంతమైన ఈ రైలును ప్రస్తుత రైల్వే వ్యవస్థకు తగినట్లుగా మార్చాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని బంకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించింది. అందుకే ఈ రైలు సేవలను ముగించేందుకు కింగ్ ఛార్లెస్ 3 ఆమోదం తెలిపినట్లు ప్రటించింది. 9 కోచ్ లు ఉండే ఈ రైలు నిర్వహణ ఒప్పంద 2027 వరకు ఉంది. ఆ తర్వాత ఈ రైలు తన సేవలకు ముగింపు పలకనుంది.
180 ఏళ్ల సేవలకు స్వస్తి
1842లో ఈ రైలు తొలిసారి పట్టాలు ఎక్కింది. అప్పటి బ్రిటిష్ రాణి విక్టోరియా ఈ రైలులో తొలిసారి ప్రయాణించారు. అప్పటి నుంచి రాయల్ ట్రైన బ్రిటిష్ వారసత్వంలో భాగం అయ్యింది. రాజ కుటుంబానికి ఈ రైలు సేవలను అందిస్తూనే ఉంది. అయితే.. ప్రస్తుతం ఈ రైలు వినియోగం తక్కువ కావడం, నిర్వహణ వ్యయం ఎక్కువ కావడంతో ఈ రైలును తన సేవల నుంచి ఉపసంహరించాలని రాజ కుటుంబం నిర్ణయించింది. ఈ రైలు 2024-25లో కేవలం రెండు ట్రిప్పుడు మాత్రమే నడించింది. అంతేకాదు, ప్రైవేట్ ఛార్టెడ్ ప్లైట్లు, హెలికాప్టర్లతో పోల్చితే, దీని వినియోగం ఖర్చు ఎక్కువ కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాయల్ ట్రైన్ నిర్మాణం మరింత ప్రత్యేకం
ఇతర రాయల్ రైళ్లలో లగ్జరీ ఫిట్టింగులు ఉన్నప్పటికీ, 1970లలో నిర్మించబడిన ప్రస్తుత వెర్షన్ మరింత క్రియాత్మకంగా ఉంటుంది. 2020లో ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ మహమ్మారి పర్యటన సమయంలో విస్తృతంగా ఉపయోగించబడింది. క్వీన్ ఎలిజబెత్ శవపేటిక 2022లో రాయల్ రైలులో తీసుకెళ్లాలని భావించినప్పటికీ, భద్రతా సమస్యల కారణంగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తీసుకెళ్లారు.
Read Also: హైదరాబాద్ మెట్రోకు ఒక్క రోజులో అంత ఖర్చవుతుందా? అస్సలు నమ్మలేరు!
విరమణకు ముందు దేశ వ్యాప్త పర్యటన
180 ఏళ్ల సేవల తర్వాత రైలు విధుల నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో చివరగా దేశ వ్యాప్తంగా తుది పర్యటన చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రైల్వే ఔత్సాహికులు, రాయల్ వీక్షకులు దాని చివరి ప్రయాణాన్ని వీక్షించడానికి వస్తారని భావిస్తున్నారు. ఆ తర్వాత రైలు క్యారేజీలు మ్యూజియంలో భద్రపరచబడతాయని అక్కడి అధికారులు తెలిపారు. అది NRM అయినా లేదా వోల్వెర్టన్ లోని రాజ కుటుంబానికి చెందిన ఇంట్లోని కొత్త మ్యూజియంలోనైనా వీటిని ఉంచే అవకాశం ఉందన్నారు. మొత్తంగా ఈ చారిత్రక రైలు త్వరలో పదవీ విరమణ చేయబోతోంది. ఏండ్ల వైభవానికి స్వస్తి పలకనుంది. మ్యూజియంలో చరిత్రగా కొలువు దీరనుంది.
Read Also: రాత్రికి రాత్రే రూ.2000 కోట్లకు అధిపతి అయిపోయాడు.. అంతా ఆ లాటరీ మహిమే!