AIR Web series Controversy : ప్రముఖ ఓటిటి ఛానల్ ఈటీవీ విన్ లో AIR అనే వెబ్ సిరీస్ విడుదలైన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ వెబ్ సిరీస్ కి విపరీతమైన పేరు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. చాలామందికి ఒక నోస్ట్రాలజియా ఫీల్ క్రియేట్ చేసింది. అయితే ఈ సిరీస్లో ఒక హాస్టల్స్ లో ఒక వర్గాన్ని ఏకం చేసేలా ఒక అబ్బాయి ఇచ్చిన స్పీచ్ తీవ్రంగా వైరల్ అయింది. ఆ స్పీచ్ వీడియో చూడడానికి కామెడీగానే ఉంటుంది. కానీ ఆ వీడియో వలన ఒక వర్గం తీవ్రంగా బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవ్వడం మారాయి.
ఈ వెబ్ సిరీస్ కి యంగ్ దర్శకుడు సందీప్ రాజ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇక సందీప్ రాసిన టార్గెట్ చేస్తూ చాలామంది ట్వీట్స్ వేయడం మొదలుపెట్టారు. అయితే ఆ ట్వీట్స్ అన్ని కూడా సందీప్ కు చేరాయి. దానితో సందీప్ ఏకంగా ట్విట్టర్ వేదికగా చాలామందికి క్షమాపణలు తెలియజేశాడు. ఈ తరుణంలో సందీప్ రాజ్ కి సపోర్ట్ గా కూడా కొన్ని పోస్టులు మొదలయ్యాయి. గతంలో జగపతిబాబు నవదీప్ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
కాస్ట్ ఫీల్ గురించి జగపతిబాబు మాటల్లో
నేను 15 సంవత్సరాల క్రితం విజయవాడ సిద్ధార్థ కాలేజ్ కి వెళ్లాను. అక్కడ ప్రిన్సిపాల్ తో నేను క్యాస్ట్ కి అగైనెస్ట్ గా మాట్లాడుతానండి అంటూ చెప్పాను. 2000 ఉన్నారండి స్టూడెంట్స్ అందరూ ఆ కాస్ట్ పిచ్చి ఉన్నోళ్లే. మీరు ఒక్కరే ఉన్నారు ఆడిటోరియం క్లోజ్డ్ ఆడిటోరియం మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తారు. అని ప్రిన్సిపల్ చెప్పినా కూడా జగపతిబాబు మైక్ తీసుకొని ఏమిటయ్యా క్యాస్ట్ క్యాస్ట్ అని అంటారు. మీ ఒక్కళ్లే కాదు బయట కూడా చాలామంది మనుషులే అంటూ మాట్లాడారు. మీరు ఏమైనా అనుకోండి కానీ దాని కోసం మర్డర్లు చేయడాలు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లు ఒప్పుకోకపోవడం, ఇవన్నీ ఎందుకు.? మీరు 2000 మంది ఉన్నారట నన్ను నరికేస్తారట” అని జగపతిబాబు చెప్పగానే ఆడిటోరియం మొత్తం విజిల్స్ క్లాప్స్ కొట్టారట.
హీరో నవదీప్ ఏం చెప్పారు.?
నేను విజయవాడలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి వెళ్ళినప్పుడు. మీ క్యాస్ట్ ఏంటి అని ఇన్డైరెక్టుగా అడిగారు. నేను మా ఇంట్లో వాళ్లని అడిగి కాస్ట్ గురించి చెప్పాను. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు కాస్ట్ గురించి పూర్తిగా చెప్పలేదు నీకు ఈ మాత్రం తెలిస్తే చాలు అని చెప్పేసారు. తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ గురించి అక్కడ ఉన్న సిచువేషన్ రియలైజ్ అయ్యాను. మన జనరేషన్లో ఇలా లేదు అనుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి అంటూ చెప్పుకొచ్చాడు నవదీప్.
ఆ వీడియోలో ఏముంది, ఎందుకు తొలగించారు.?
వెబ్ సిరీస్ లో ఉన్న వీడియోలో ఒక అబ్బాయి కొంతమంది అబ్బాయిలను కూడబెట్టుకొని ఒక లెక్చర్ ఇస్తాడు. దానిలో మనకు ఇష్టమైన ఐపీఎల్ టీం సీఎస్కే, క్రికెట్ టీం ఆస్ట్రేలియా, ఇష్టమైన వెహికల్ సైకిల్, మన ఫేవరెట్ అనిమల్ లయన్, మన ఫేవరెట్ హీరోయిన్ చాందిని చౌదరి. అనే దగ్గర వీడియో ఎండ్ అవుతుంది. ఈ వీడియోని తీవ్రమైన కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోను దానిలో నుంచి తొలగించారు. కానీ సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది.
Also Read : Air : యంగ్ దర్శకుడు ఆవేదన, ఈసారి నుండి జాగ్రత్తగా ఉంటాను