Hansika Motwani: ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఒక జంట పెళ్లయిన తర్వాత కలిసి కనిపించకపోయినా.. కలిసి పోస్ట్లు షేర్ చేయకపోయినా సరే.. వారు విడిపోతున్నారు అంటూ రూమర్లు దావాణంలా వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హన్సిక మోత్వానీ(Hansika Motwani) కూడా విడాకులు తీసుకోబోతోంది అనే వార్త సంచలనం సృష్టించింది. గత రెండు రోజులుగా ఈ వార్త అభిమానులను జీర్ణించుకోలేకపోయేలా చేస్తోందని చెప్పవచ్చు.
విడాకులు తీసుకోబోతున్న హన్సిక..
అసలు విషయంలోకి వెళ్తే.. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న సోహైల్ కతురియా (Sohail Khaturiya)అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది హన్సిక. వాస్తవానికి సోహైల్.. హన్సిక చిన్ననాటి స్నేహితురాలు రింకీ బజాజ్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి హన్సిక కూడా హాజరైంది. కానీ ఎందుకో వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగ లేకపోయింది. దాంతో సోహైల్ – రింకీ బజాజ్ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సోహైల్ హన్సిక కి దగ్గరయ్యారు. 2022 డిసెంబర్ 4న జైపూర్ లో వీరు వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం తర్వాత ఏడాది పాటు సంతోషంగా ఉన్న ఈ జంట.. తమ ప్రతి వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దీనికి తోడు మొదటి వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేకమైన ఫోటోలను కూడా పంచుకోవడం జరిగింది. తర్వాతే ఏమైందో తెలియదు కానీ అప్పటినుంచి ఈ జంటకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వలేదు. అటు హన్సిక కూడా తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను పంచుకోలేదు.
భర్త ఫ్యామిలీలో ఇమడలేకపోయిన హన్సిక..
ఇక దీంతో హన్సిక తన భర్త నుండి విడాకులు తీసుకోబోతోంది అనే వార్త ఒక్కసారిగా గుప్పుమంది. దీనికి తోడు కతూరియాది పెద్ద ఫ్యామిలీ అని, ఆ ఫ్యామిలీలో హన్సిక ఇమడలేకపోతోందని.. ఈ కారణంగానే ఇద్దరు విడిపోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి.
విడాకుల వార్తలపై స్పందించిన హన్సిక భర్త..
ఇక వార్తలు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో.. తాజాగా హన్సిక భర్త సోహైల్ స్పందించారు. ఒకే ఒక్క మాటతో ఆయన విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టారు. తాజాగా ఒక నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సోహైల్ మాట్లాడుతూ.. “విడాకులు అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదు. అది కేవలం రూమర్ మాత్రమే” అంటూ కొట్టి పారేశారు. ఇక ఈ విషయం తెలిసే అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏదేమైనా హన్సిక విడాకులు తీసుకోబోతోంది అంటూ వచ్చిన వార్తలు ఫేక్ అని, ఎవరో కావాలనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేశారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. ఇక హన్సిక విషయానికి వస్తే పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇప్పుడు అడపాదడపా అవకాశాలు అందుకుంటూ ఉండడం గమనార్హం.