IND VS AUS: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 3 వన్డేల నేపథ్యంలో ఇప్పటికే మొన్న 19వ తేదీన మొదటి వన్డే పూర్తయింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. రేపు అంటే గురువారం రోజున టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండవ వన్డే జరగనుంది. ఈ వన్డే నేపథ్యంలో రోహిత్ శర్మకు ఊహించని ఎదురుదెబ్బ తగలనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్ని రోజులు ఓపెనర్ గా ఉన్న రోహిత్ శర్మను మిడిల్ ఆర్డర్లో బరిలోకి దింపే ఆలోచనలో గౌతమ్ గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Team India -Divorce: విడాకులు తీసుకున్న మరో టీమిండియా ప్లేయర్…భార్య లేకుండానే దీపావళి వేడుకలు
రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీపై గౌతమ్ గంభీర్ పగ పెంచుకున్నాడని తెగ వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే మొన్న రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా పీకి పడేసారని, దీని వెనుక గౌతమ్ గంభీర్ ఉన్నారని ఫైర్ అవుతున్నారు అభిమానులు. మహేంద్ర సింగ్ ధోనీకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా వీరాభిమానులు. ఇది మనసులో పెట్టుకున్న గౌతమ్ గంభీర్, రోకోపై ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడకుండా వీళ్లిద్దరిని తొందరగా బయటికి పంపించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో భాగంగానే రేపు జరిగే వన్డే మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ లో రోహిత్ శర్మను పంపించే దిశగా అడుగులు వేస్తున్నారట గౌతమ్ గంభీర్. కేఎల్ రాహుల్ ను ఓపెనర్ గా పంపించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రేపటి వన్డేలో రోకో మరోసారి విఫలమైతే మూడో వన్డేలో వాళ్లకు ఛాన్స్ కూడా దక్కకుండా చేసే కుట్రలు కూడా పన్నుతున్నాడట. ఇలా చేస్తే, రిటైర్మెంట్ ఇస్తారనే కుట్రలు పన్నుతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
టీవి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రేపు వన్డే మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అడిలైడ్ వేదికగా 15 వన్డేలు ఆడిన టీమిండియా 9 మ్యాచ్ లలో గెలిచింది. ఇక్కడ గత 17 సంవత్సరాలుగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా. దీంతో ఆ రికార్డును కాపాడుకునేందుకు కసరతులు చేస్తోంది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు రాణిస్తే ఖచ్చితంగా టీమ్ ఇండియా గెలుస్తుందని అంటున్నారు.
ఆస్ట్రేలియా ప్రాబబుల్ ఎలెవన్: 1 మిచెల్ మార్ష్ (కెప్టెన్), 2 ట్రావిస్ హెడ్, 3 మాథ్యూ షార్ట్, 4 అలెక్స్ కారీ (వికెట్ కీపర్), 5 మాథ్యూ రెన్షా, 6 కూపర్ కోనోలీ, 7 మిచెల్ ఓవెన్, 8 మిచెల్ స్టార్క్, 9 నాథన్ ఎల్లిస్, 10 జోష్ హాజిల్‌వుడ్, 11 ఆడమ్ జంపా
ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (సి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికె), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్