BigTV English

Maganti Suneetha: మాగంటి గోపీనాథ్ కు సునీత భార్య కాదా? నామినేషన్ లో అసలు ట్విస్ట్..

Maganti Suneetha: మాగంటి గోపీనాథ్ కు సునీత భార్య కాదా? నామినేషన్ లో అసలు ట్విస్ట్..
Advertisement

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం రచ్చ రచ్చగా మారింది. మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక రాగా, ఆయన భార్య మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. తీరా నామినేషన్ల వేళ, ఆమె అసలు గోపీనాథ్ భార్యే కాదనే వాదన బయటకు వచ్చింది. మాగంటి గోపీనాథ్ తన తండ్రి అని చెబుతున్న తారక్ ప్రద్యుమ్న అనే యువకుడు, తన తల్లి మాత్రమే ఆయన భార్య అని అంటున్నారు. తన తల్లి తర్వాత తండ్రి జీవితంలోకి సునీత వచ్చారని, అంతే కానీ, ఆమె ఆయనకు భార్య కాలేదని బాంబు పేల్చారు. మాగంటి గోపీనాథ్, సునీత కేవలం లివ్ ఇన్ రిలేషన్ లో మాత్రమే ఉన్నారని అంటున్నారు ప్రద్యుమ్న. వాస్తవంగా అసలు వారసుడైన తనకు బీఆర్ఎస్ టికెట్ రావాల్సి ఉండగా, తనను సునీత వర్గం వారు బెదిరించారని చెప్పారు. ఆమె నామినేషన్ క్యాన్సిల్ చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు ప్రద్యుమ్న.


ఏం జరుగుతుంది?
నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అవి తిరస్కరణకు గురవుతాయి. అందుకే పేరు దగ్గర్నుంచి, ఆస్తి పాస్తులు, బకాయిలు ఉన్న పన్నుల వివరాలతో సహా అన్నీ నామినేషన్ లో పొందు పరుస్తుంటారు. కానీ ఇక్కడ మాగంటి సునీత తన భర్త మాగంటి గోపీనాథ్ అని పేర్కొంటూ నామినేషన్ దాఖలు చేశారు. పైగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ తప్పు అంటూ తారక్ ప్రద్యుమ్న గొడవ చేస్తున్నారు. గోపీనాథ్ తన తల్లికి విడాకులు ఇవ్వకుండా సునీతకు దగ్గరయ్యారని ఆ నిజాలను దాచిపెట్టి ఆమె ఫ్యామిలీ సర్టిఫికెట్ సంపాదించారని ఆరోపించారు. సునీత దగ్గరున్న ఫ్యామిలీ సర్టిఫికెట్లను అక్టోబర్ 11వ తేదీన ఆర్డీవో రద్దు చేశారని చెప్పారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన సునీత నామినేషన్ తిరస్కరించాలంటూ ప్రద్యుమ్న ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్ కి ముందే తెలుసా?
సునీత వ్యవహారం బీఆర్ఎస్ కి ముందే తెలుసని అంటున్నారు కొంతమంది నేతలు. అందుకే సేఫ్ సైడ్ పీజేఆర్ తనయుడు విష్ణు వర్దన్ రెడ్డితో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయించారని చెబుతున్నారు. సునీత వ్యవహారం రచ్చకెక్కి, ఆమెకు ఉపయోగపడుతుందనుకున్న సెంటిమెంట్ అస్త్రం ఫెయిల్ అయితే, విష్ణు వర్దన్ రెడ్డికి ఓటు వేయాలని బీఆర్ఎస్ అభ్యర్థించే అవకాశాలున్నాయి. అంతా తెలిసే బీఆర్ఎస్ నాటకం ఆడుతోందని వైరి వర్గాలు విమర్శలు చేస్తున్నాయి.


వారసులెవరు?
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విజేత ఎవరు అనే దానికంటే, మాగంటి గోపీనాథ్ వారసులు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ఈ ఉప ఎన్నికలతో మాగంటి గోపీనాథ్ కుటుంబ పరువు బజారున పడిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఆయనకు ఇద్దరు భార్యలనే విషయం అతి కొద్దిమందికే తెలిసి ఉంటుంది, ఇప్పుడు ఆ వ్యవహారం రచ్చకెక్కింది. ఇక్కడ సింపతీ అస్త్రం పనిచేసే అవకాశమే లేదని రాజకీయ వర్గాల సమాచారం. మరిప్పుడు బీఆర్ఎస్ వ్యూహం ఏంటో తేలాల్సి ఉంది.

ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు 40 నామినేషన్లను అధికారులు స్క్రూట్నీ చేశారు. సునీత నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, అధికారులు వాటిని వెరిఫై చేసి అంగీకరించారు. తాజాగా తారక్ ప్రద్యుమ్న ఫిర్యాదుతో సునీత డిక్లరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

Related News

Bus Service: ఎట్టకేలకు ఆ ఊరికి బస్సు సర్వీస్ ప్రారంభం.. 30 ఏళ్ల కల నెరవేరిన వేళ గ్రామస్తుల హర్షం..

Check Posts: తెలంగాణలో అన్ని రవాణా చెక్‌పోస్టుల రద్దు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

Jubilee Hills By-Election: జూబ్లీ‌హిల్స్ బైపోల్.. వీకెండ్‌లో ప్రచారానికి కేసీఆర్? ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ

Hyderabad News: నా చావుకు కేటీఆర్, ఆ నేతలే కారణం.. బీఆర్ఎస్ మహిళా కార్యకర్త పోస్ట్ వైరల్

Warangal Politics: కొండా ఎపిసోడ్‌లోకి బీఆర్ఎస్.. పావులు కదుపుతున్న రాజయ్య, మేటరేంటి?

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ బైపోల్‌లో మరో అంకం.. ప్రధాన పార్టీల నేతలు రెడీ

Diwali Eye effected: దీపావళి టపాసుల ఎఫెక్ట్.. కంటి సమస్యలతో సరోజినీ దేవి ఆసుపత్రికి బాధితులు క్యూ

Big Stories

×