Shama Mohamed: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. ఆయన హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఎవరో ఒకరు గంభీర్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అతని సెలెక్షన్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా సర్ఫరాజ్ ఖాన్ ను ( Sarfaraz Khan ) సెలెక్ట్ చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా లీడర్ షామా మహమ్మద్ ( Shama Mohamed) స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఆమె… సర్ఫరాజ్ ను సెలెక్ట్ చేయకపోవడంపై మండిపడ్డారు. ముస్లిం కుటుంబానికి చెందిన సర్ఫరాజ్ ను ఎందుకు సెలెక్ట్ చేయలేదని నిలదీశారు.
సర్ఫరాజ్ ఇంటి పేరులో ” ఖాన్ ” అని ఉండడం వల్లే సెలెక్ట్ చేయలేదా ? అని నిప్పులు చెరిగారు షామా మహమ్మద్ ( Shama Mohamed). టీమిండియాలో హిందువులకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారని పరోక్షంగా మండిపడ్డారు. ముస్లిం క్రికెటర్లకు కూడా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కావాలనే గౌతమ్ గంభీర్… ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బిజెపిలో పనిచేసిన గంభీర్ ను హెడ్ కోచ్ చేస్తే ఇలాగే టీమిండియా సెలక్షన్ ఉంటుందని ఆమె ఫైర్ అయ్యారు. దీంతో షామా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇక అటు సర్ఫరాజ్ ఖాన్ ను ( Sarfaraz Khan ) సెలెక్ట్ చేయకపోవడంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin Owaisi) కూడా స్పందించారు. టీమిండియాలో కచ్చితంగా ఉండాల్సిన ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నారు. అలాంటిది టీమిండియా ఏ జట్టులో అయినా స్థానం కల్పించక పోవడం దారుణం అంటూ ఆగ్రహించారు అసదుద్దీన్ ఒవైసీ. అలా కాదని, పెద్దగా ఆట తీరును కనబరచని ప్లేయర్లను సెలక్ట్ చేశారని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ఫైర్ అయ్యారు.
సర్ఫరాజ్ ఖాన్ ను చూడడానికి చాలా బరువుగా దిట్టంగా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా అతనికి టీం ఇండియాలో ఛాన్సులు రాలేదు. ఆటతీరు బాగా ఉన్నా.. అతడు అన్ ఫిట్ అని రిజెక్ట్ చేసేవారు. కానీ ఇటీవల కాలంలో ఏకంగా 17 కేజీలు తగ్గిపోయాడు సర్ఫరాజ్ ఖాన్. కేవలం టీమిండియా సెలెక్టర్ల దృష్టి పడేందుకే ఈ 17 కేజీలు తగ్గాడు. అయినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ కు అన్యాయమే జరిగింది. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా ఏ జట్ల మధ్య అన్ అఫీషియల్ టెస్ట్ మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఈ లిస్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకుండానే జట్టును ప్రకటించారు. దీంతో ఈ వివాదం రాజుకుంది.
Also Read: Team India -Divorce: విడాకులు తీసుకున్న మరో టీమిండియా ప్లేయర్…భార్య లేకుండానే దీపావళి వేడుకలు
SHOCKING NEWS 🚨 Congress national spokesperson Shama Mohamed accuses Gautam Gambhir of religious bias in Cricket 😳
SHAMA ⚡ : Why Sarfaraz Khan not selected for India A team? Because of his surname?
BJP's SHEHZAD 🔥 : "You called Rohit Sharma fat. In the same team Siraj &… pic.twitter.com/tqh2VDzbkm
— Times Algebra (@TimesAlgebraIND) October 22, 2025