Sravana Bhargavi: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది సెలబ్రిటీలో పెళ్లిళ్లు చేసుకున్న కొద్ది రోజులకి విడాకులు(Divorce) తీసుకొని విడిపోతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఈ కల్చర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేది కానీ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విడాకులు తీసుకొని విడిపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇలా విడాకుల గురించి తరచు వార్తల్లో నిలుస్తున్న వారిలో సింగర్ హేమచంద్ర (Hemachandra)శ్రావణ భార్గవి(Sravana Bhargavi) జంట ఒకటి. వీరిద్దరూ ప్లే బ్యాక్ సింగర్స్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇలా వివాహం తర్వాత కొంతకాలం పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులు ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. ఇలా తమ కూతురితో ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ గత కొంతకాలంగా విడిగా ఉండటమే కాకుండ, శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో తన భర్త గురించి ఎక్కడ ప్రస్తావించకపోవడంతో వీరి విడాకుల వార్తలు తరచూ తెరపైకి వస్తున్నాయి. ఇలా విడాకుల గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట మాత్రం ఎక్కడ ఈ వార్తలను ఖండించలేదు దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
ఇలా వీరి విడాకుల గురించి తరచూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా శ్రావణ భార్గవి చేసిన ఒక పోస్ట్ మరోసారి సంచలనంగా మారింది. దీపావళి పండుగను పురస్కరించుకొని సెలెబ్రెటీలందరూ దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రావణ భార్గవి సైతం దీపావళి పండుగ ఫోటోలను షేర్ చేశారు. అయితే తన తల్లిదండ్రులతో, తన సోదరుడితో కలిసి ఈమె దీపావళి జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను శ్రావణ భార్గవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..
“ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఒక తమ్ముడు అది స్టోరీ.. హ్యాపీ దీపావళి అంటూ” ఈమె తన తల్లిదండ్రులు తమ్ముడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు మరి హేమచంద్ర ఎక్కడ? మీ కూతురు శిఖర ఎక్కడ ?అంటూ కామెంట్లు చేస్తున్నారు. శ్రావణ భార్గవి ఈ పోస్ట్ చేయడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని, అయితే ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించలేదు అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా పోస్టుతో శ్రావణ భార్గవి తన విడాకులను కన్ఫామ్ చేసిందా? అంటూ మరికొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారా లేదా అనే విషయాల పట్ల క్లారిటీ రావాలి అంటే శ్రావణ భార్గవి లేదా హేమచంద్ర స్పందించాల్సి ఉంటుంది.
Also Read: Mass Jathara: మాస్ జాతర నుంచి సూపర్ డూపర్ సాంగ్ రిలీజ్.. అర్థం పర్థం లేదంటూ!