BigTV English

Happy Days Appu: హ్యాపీ డేస్ అప్పు గుర్తుందా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి!

Happy Days Appu: హ్యాపీ డేస్ అప్పు గుర్తుందా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి!

Happy Days Appu: కొంతమంది నటీనటులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చేసింది ఒకటి లేదా రెండు సినిమాల అయినప్పటికీ ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోతారు. అంత అద్భుతమైన పాత్రలలో నటించినప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల తిరిగి ఇండస్ట్రీలో కొనసాగలేని వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో హ్యాపీడేస్(Happy Days) చిత్రంలో అప్పు(Appu) పాత్రలో నటించిన నటి గాయత్రి రావు(Gayatri Rao) ఒకరు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ చిత్రం హ్యాపీ డేస్. ఈ సినిమా ఇప్పుడు చూసిన ఒక సరికొత్త అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ తమన్నా వంటి వారు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.


కుటుంబం మొత్తం నటీనటులే..

ఇక ఈ సినిమాలో ఎంతోమంది యువనటీనటులు నటించారు. ఇక ఈ సినిమాలో హీరో నిఖిల్ కి జోడిగా అప్పు నటించిన తీరు అందరిని ఎంతగానో కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న అప్పు తదుపరి వరుస అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అవుతుందని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. అప్పు కుటుంబ సభ్యులందరూ కూడా నటీనటులు అనే విషయం మనకు తెలిసిందే. గాయత్రీ రావు తల్లి బెంగుళూరు పద్మగా (Bengurulu Padma) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో అనేక చిత్రాల్లో, బుల్లితెర సీరియల్స్ లో నటించారు.


 

సినిమాలకు గుడ్ బై?

ఇక గాయత్రి రావు మాత్రం హ్యాపీ డేస్ సినిమా తర్వాత ఆరెంజ్ చిత్రంలో, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు. ఈ సినిమాల ద్వారా పెద్దగా సక్సెస్ అందుకొని ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న గాయత్రి రావు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారని తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉండే గాయత్రి రావుకు సంబంధించి తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసినా అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అదేంటి హ్యాపీడేస్ సినిమాలో అల్లరి చేష్టలు చేస్తూ కనిపించిన అప్పు నేనా ఇక్కడ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బొద్దుగా మారిపోయిన అప్పు…

హ్యాపీడేస్ సినిమాలో ఎంతో చక్కగా టామ్ బాయ్ పాత్రలో తన నటన పరంగా, లుక్ పరంగా అందరిని మెప్పించిన ఈమె ప్రస్తుతం మాత్రం గుర్తుపట్టలేనంతగా చాలా బొద్దుగా తయారు కావడంతో అప్పు ఏంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మొత్తానికి వెండితెరపై ఎంతో మంచి కెరియర్ ఉన్న ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరం కావడంతో అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.. ఇక కుటుంబం మొత్తం నటీనటులు కావడంతో ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాలి. తిరిగి గాయత్రి రావు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కన్నప్పపై మనోజ్ రివ్యూ.. ఒక్క ముక్కతో అన్న పరువు తీశాడు

Related News

Hero Darshan: హీరో దర్శన్ కేసు ఎఫెక్ట్… ఆ హీరోయిన్ మళ్లీ అరెస్ట్ !

Aamir Khan: ఓన్లీ 50 రూపాయలే… అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమీర్ ఖాన్!

Jr NTR Look: ఎన్టీఆర్ బాలీవుడ్‌ డెబ్యూ అట్టర్ ప్లాప్… బీ టౌన్‌ ఆడియన్స్ రియాక్షన్ ఎంటంటే ?

Coolie : వేయి ఆశలు… ఇప్పుడు కూలీ కూడా కూల్చేసింది

Jr NTR: అందరికీ దూరం… ఒంటరి పోరాటం… నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ మళ్లీ కౌంటర్ ?

Coolie : రజనీకాంత్ సినిమా అన్నారు, కానీ సౌబిన్ హీరో చేసేసారు

Big Stories

×