Manchu Manoj Review On Kannappa: మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా నటించిన కన్నప్ప (Kannappa)సినిమా నేడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకకాలంలో ఐదు భాషలలో విడుదలైన నేపథ్యంలో సినిమాకు మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా కోసం మంచు మనోజ్ (Manchu Manoj)తన కుటుంబంలో ఉన్న విభేదాలను పక్కనపెట్టి ఈ సినిమా చూడటం కోసం వచ్చారు. ఈయన అభిమానుల సమక్షంలో ఐమాక్స్ లో కన్నప్ప సినిమాని చూశారు. ఇక ఈ సినిమా చూసిన అనంతరం మనోజ్ ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ..” ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా మరో లెవెల్ కి వెళ్తుంది. క్లైమాక్స్ లో ఇంత గొప్పగా పెర్ఫార్మెన్స్ చేస్తారని కలలో కూడా ఊహించలేదు. సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.. ఇలా మనోజ్ ప్రభాస్ పేరును పలుకుతూ మాట్లాడారు, కానీ ఎక్కడ తన అన్నయ్య విష్ణు పేరును పలకకపోవటం గమనార్హం.
విష్ణు పేరు పలకడం ఇష్టం లేదా?
ఇలా ఈ సినిమా గురించి మంచు మనోజ్ అద్భుతమైన రివ్యూ ఇచ్చినప్పటికీ విష్ణు గురించి ఎక్కడ మాట్లాడకపోవడంతో మీరిద్దరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ సినిమా మంచి విజయం కావాలని గతంలో కూడా మనోజ్ కోరుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదలవుతున్న తరుణంలో ఈయన సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాలో నటించిన తన కుటుంబ సభ్యులందరి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకున్నారు. అయితే ఇక్కడ కూడా విష్ణు పేరు చెప్పకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రభాస్ నటన అద్భుతం..
ఇక మంచు విష్ణు ఈ సినిమా కోసం గత పది సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు పిల్లలందరూ కూడా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు నిర్మాణ సంస్థలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావటంతో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటించిన నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు సైతం థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ప్రభాస్ స్క్రీన్ పై దాదాపు అరగంట పాటు కనిపించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఇక మనోజ్ సైతం ప్రభాస్ నటన గురించి ఎంతో గొప్పగా వర్ణించారు. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా మరో లెవెల్ కి వెళ్ళింది అంటూ మనోజ్ చెప్పటం విశేషం. ఏది ఏమైనా అన్నయ్య సినిమాకు ఇలా తమ్ముడు రివ్యూ ఇవ్వడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న కలహాలు తొలగిపోయి ఎప్పటిలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఇక కన్నప్ప సినిమాతో విష్ణు కూడా మంచి హిట్ అందుకున్నారనే చెప్పాలి.
కన్నప్ప వెయి రేట్లు బాగుంది – మంచు మనోజ్ #KannappaMovie #KannappaReview #ManchuManoj #VishnuManchu #MohanBabu #Prabhas𓃵 #BIGTVCinema @HeroManoj1 @iVishnuManchu @themohanbabu @kannappamovie pic.twitter.com/xX7I3F0hH0
— BIG TV Cinema (@BigtvCinema) June 27, 2025
Also Read: ఆ సీరియల్ నుంచి కావ్య అవుట్… బిగ్ బాస్ 9 ఎంట్రీ కన్ఫామ్ అయ్యిందా?