HHVM: సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu). ఈ సినిమా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పలుచోట్ల ఈ సినిమాకు మంచి ఆదరణ లభించగా మరికొన్ని చోట్ల విమర్శలను ఎదుర్కొంటుంది. అయితే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పాలి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా చూడటం కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తి కనపరిచారు. ఇక ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాబట్టడంతో చిత్రబృందం ఇప్పటికే సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
పాపలకే పాపా నిధి పాప…
ఇలా సక్సెస్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా చిత్ర బృందం పెద్ద ఎత్తున థియేటర్లను విజిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శక, నిర్మాతలతో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agerwal)కూడా థియేటర్లను విజిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ థియేటర్ కు వెళ్లినటువంటి ఒక వీడియోని నిధి అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో నిధి అగర్వాల్ ని చూసిన ప్రేక్షకులు “పాపలకే పాపా నిధి పాప” అంటూ నినాదాలు చేయడంతో హీరోయిన్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
కూల్ గా కౌంటర్ ఇచ్చిన నిధి…
ఇక ఈ వీడియోని నిధి అగర్వాల్ షేర్ చేయడంతో నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ “ఈ సినిమా నాకు ఏమాత్రం నచ్చలేదు” అంటూ కామెంట్ చేశారు. హీరోయిన్ కి డైరెక్ట్ గా ఇలాంటి కామెంట్ పెట్టడంతో నిధి అగర్వాల్ సైతం ఈ కామెంట్ పట్ల స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. నిధి అగర్వాల్ స్పందిస్తూ..”పర్లేదు అండి.. అన్ బయాస్ గా ఉండే ప్రేక్షకులకు మూవీ నచ్చుతుంది” అంటూ చాలా కూల్ గా సదరు నెటిజన్ కు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Randomly did a theatre visit yesterday to a houseful show and absolutely loved the energy and response #BlockBusterHHVM ❤️🔥🦅🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/SCv2hK3QXU
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) July 26, 2025
ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా హిస్టారికల్ పీరియాడిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏ.ఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ(Jyothi Krishna) ఈ సినిమాకు దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు తెలియజేశారు. ఇక రెండో భాగానికి “యుద్ధభూమి” అనే టైటిల్ కూడా ప్రకటించబోతున్నారంటూ ఈ సినిమా క్లైమాక్స్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ పనులు జరుపుకుంటుంది ఏంటి అనే విషయాల పట్ల ఏమాత్రం క్లారిటీ లేదు.
Also Read: Jr NTR War2: వార్ 2 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న ఎన్టీఆర్.. హృతిక్ కంటే ఎక్కువ?