BigTV English

Jr NTR War2: వార్ 2 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న ఎన్టీఆర్.. హృతిక్ కంటే ఎక్కువ?

Jr NTR War2: వార్ 2 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న ఎన్టీఆర్.. హృతిక్ కంటే ఎక్కువ?

Jr NTR War 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుని వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల దేవర(Devara) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ చిత్రం వార్ 2(War 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కు ఎంతో మంచి ఆదరణ లభించడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలను పెంచేస్తోంది.


బాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్ హవా…

ఇక ఎన్టీఆర్ కు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈయన రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉందని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు సుమారు వంద కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అయితే వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ భారీగా రెమ్యూనరేషన్ (Remuneration) తీసుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్(Hrithik Roshan) కంటే కూడా ఎక్కువగా ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఏకంగా 60 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.


హృతిక్ కంటే ఎన్టీఆర్ కే ఎక్కువ?

ఇక ఎన్టీఆర్ కే రెమ్యూనరేషన్ అత్యధికం కావడం విశేషం. హృతిక్ రోషన్ ఈ సినిమా కోసం 48 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ 32 కోట్లు, నటి కియారా 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ కంటే కూడా ఎన్టీఆర్ అధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఏంటో స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమా యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగమైన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

వార్ 2 కు పోటీగా కూలీ…

ఇక ఇదే రోజు ఈ సినిమాకు పోటీగా రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల విషయంలో అభిమానులు కూడా ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 చేయబోతున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కుమారస్వామి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Vijay Devarakonda: తిరుపతిలో విజయ్ దేవరకొండకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ!

Related News

Vedhika: బికినీలో కూడా నటిస్తా.. గట్టి కౌంటర్ ఇచ్చిన వేదిక.. ఏమైందంటే?

Bandla Ganesh: మరోసారి అల్లు అరవింద్‌పై బండ్లన్న కామెంట్స్‌.. అంతమాట అనేశాడేంటి..

Manchu Lakshmi: హాస్పిటల్ బెడ్ పై మంచు లక్ష్మీ.. ఆందోళనలో ఫ్యాన్స్!

Manchu Lakshmi: రామ్ చరణ్ ఇంట్లో ఉన్న మంచు లక్ష్మి… టాప్ సీక్రెట్ రివీల్

Poonam Pandey: రామాయణ కీలక పాత్రలో పూనమ్ పాండే.. మండిపడుతున్న హిందూ సంఘాలు

Dhanush: అదే నా కల.. అందుకే మీ సినిమాలలో ఆ పాత్రలు చేస్తున్నారా సార్!

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Big Stories

×