Master Rohan Special Request to Vijay Devarakonda: 90’s మిడిల్ క్లాస్ బయెపిక్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్టర్ రోషన్. ఈ చిత్రంలో సాంప్రదాయని సుద్దపూసని బ్యాగ్రౌండ్ సాంగ్ వస్తుండగా.. అతడు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే అల్లరి అబ్బాయి ఎలా ఉంటాడో అచ్చం వెండితెరపై ఆవిష్కరించాడు రోహన్. ఇందులో అతడి నటన, అమాకత్వం, కామెడీతో ప్రేక్షకులకు మెప్పించాడు. ఈ సినిమాలో రోషన్ ఓవర్నైట్స్టార్ అయిపోయాడు.
ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించి మాస్టర్ రోహన్ అయిపోయాడు. తాజాగా అతడు ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో‘. తిరువూరు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రేపు (నవంబర్ 7) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్లో భాగంగా నిన్న ఇండస్ట్రీ ప్రముఖులు, మీడియా జర్నలిస్టుల కోసం స్పెషల్ షో వేశారు. ఈ షోతో సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ప్రీమియర్స్ అనంతరం మూవీ టీం ప్రెస్మీట్లో పాల్గొంది. మీడియా సమావేశంలో మూవీ టీంతో పాటు మాస్టర్ రోషన్ కూడా పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తనకు ఈ అవకావం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తమ సినిమా అందురూ చూడాలని ప్రమోట్ చేశాడు. హీరో తిరువూరు, హీరోయిన్లకు పేరు పేరునా థ్యాంక్స్ చెప్పాడు. మధ్య హీరో విజయ్ దేవరకొండకు ఓ స్పెషల్ రిక్వెస్ట్ పెట్టాడు. సినిమా మంచి టాక్ తెచ్చుకున్న జోష్ లో మాస్టర్ రోహన్ మైక్ పట్టుకుని చెలరేగిపోయాడు. సినిమాతో హిట్ కొట్టామంటూ తెగ సంబరపడిపోయాడు. అదే జోష్ విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Also Read: Deepthi Manne: ‘జగద్ధాత్రి‘ సీరియల్ హీరోయిన్ పెళ్లి సందడి షురూ.. హల్తీ ఫోటోలు వైరల్!
‘కల్ట్ బొమ్మ ఇచ్చాం. టీజర్ చూసినప్పుడే చెప్పాను. మా సినిమా హిట్ అని. విజయ్ దేవరకొండ అన్న మా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీం మొత్తానికి రౌడీ టీ–షర్టులో రెడీ పెట్టుకో” అంటూ మైకోలో గట్టిగా అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా లిటిల్ హార్ట్ మూవీ టీంకి విజయ్ దేవరకొండ రౌడీ టి–షర్టులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తన కో–స్టార్ అయిన మౌలికి లిటిల్ హార్ట్స్ తో హిట్ కొట్టాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో విజయ్ టీంతో పిలిచి స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. అంతేకాదు మౌలికి తన రౌడీ బ్రాండ్ టి–షర్టు, స్వెట్ షర్టు గిఫ్ట్గా ఇచ్చాడు. దీంతో ఇప్పుడు మాస్టర్ రోహన్ కూడా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీంకి కూడా టి–షర్టులు ఇవ్వాలంటూ విజయ్ దేవరకొండకు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టాడు.
Rohan speech 😁👌💥 mouli reference..maa mummy 😂❤️ #PreWeddingShow premieres today 🥰🥳 ee weekend ki set cheyali pic.twitter.com/EFCPO3q4V9
— 𝓐𝓿𝓲𝓷𝓪𝓼𝓱 (@avinash2120) November 6, 2025