BigTV English

India To America: అమెరికాలో ఇండియన్ ఫోన్ల హవా.. చైనాకు చెక్.. ప్రతి 3 ఫోన్లలో ఒకటి మనదే!

India To America: అమెరికాలో ఇండియన్ ఫోన్ల హవా.. చైనాకు చెక్.. ప్రతి 3 ఫోన్లలో ఒకటి మనదే!

ఒకప్పుడు మేడిన్ అమెరికా, మేడిన్ జపాన్, మేడిన్ ఇంగ్లండ్ వస్తువులంటే మన దేశంలో భలే క్రేజ్. ఇప్పుడు ఆ దేశాలకు చెందిన కంపెనీలు కూడా మన దేశంలోనే ప్లాంట్లను పెట్టి ఇక్కడే వాటిని తయారు చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కంపెనీలన్నీ మేడిన్ ఇండియా బ్రాండ్ ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయనమాట. తాజాగా ఇలాంటి ఎగుమతుల్లో భారత్ మరో పెద్ద మైలురాయిని అందుకుంది. అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రతి 3 స్మార్ట్ ఫోన్లలో ఒకటి ఇండియాలో తయారైందే కావడం ఈ ఘనతకు కారణం. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో చైనా టాప్ ప్లేస్ లో ఉండగా, దాన్ని రీప్లేస్ చేసేందుకు భారత్ దూసుకెళ్తోంది.


చైనాని వెనక్కు నెట్టిన భారత్..
2025 ప్రారంభం నుంచి ఎగుమతుల్లో భారత్ దూకుడుగా ఉంది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో అమెరికాకు ఎగుమతి అయ్యే స్మార్ట్ ఫోన్లలో భారత్ వాటా 36 శాతానికి పెరిగింది. గతేడాది ఇది కేవలం 11 శాతం మాత్రమే. ఇక చైనా గతేడాది 82 శాతం ఫోన్లను అమెరికాకు ఎగుమతి చేయగా, ఈ ఏడాది ఆ పర్సంటేజ్ 49 దగ్గర ఆగిపోయింది. అంటే భారత్, చైనాను వెనక్కు నెట్టేందుకు ఎంతోకాలం ఆగాల్సిన పనిలేదనమాట.

యాపిల్ టాప్..
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న స్మార్ట్ ఫోన్లలో యాపిల్ కంపెనీ ఫోన్లు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. విలువ పరంగా యాపిల్ ఫోన్లు ఎక్కువ శాతం ఆక్రమించాయి. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ బాంబు పేల్చారు. భారత్ లో తయారు చేసిన ఐఫోన్‌లను అమెరికాలో అమ్మితే 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు. ఆయన హెచ్చరిక ప్రభావం ఇంకా మన ఎగుమతులపై పడలేదు. అదే సమయంలో యాపిల్ కంపెనీ ఇండియాని అత్యంత నమ్మకమైన తయారీ కేంద్రంగా భావిస్తోంది. భారత్ లో తయారీని మరింత వృద్ధి చేస్తోంది. ఏప్రిల్ నుంచి మొదలు పెడితే అమెరికాలో అమ్ముడవుతున్న ఐఫోన్లు ఎక్కువగా భారత్ నుంచే వెళ్లాయి. ప్రపంచ వ్యాప్తంగా 100 ఐ ఫోన్లు తయారైతే అందులో 20 ఫోన్లు ఇండియాలోనే తయారు చేస్తోంది యాపిల్ కంపెనీ. ఇంతకు ముందు చైనాలో ఎక్కువ ఫోన్లు తయారు చేస్తే, ఇప్పుడా స్థానం భారత్ ఆక్రమిస్తోంది.


ఇండియా చొరవ..
అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ (USITC) డేటా ప్రకారం, ఈ ఏడాది మే నెల వరకు అమెరికాకు వెళ్లే భారత స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు మూడు రెట్లు పెరిగి 21.3 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. విలువ ఆధారంగా ఈ మొత్తం 182 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. అంటే అది 9.35 బిలియన్ డాలర్లు అన్నమాట. దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలితం ఇది అని అంటున్నారు. 2014-15తో పోల్చి చూస్తే నేడు భారతదేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 28 రెట్లు పెరిగింది. మొబైల్ ఫోన్ల విలువ రూ.5.45 లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం. ఎగుమతులు 127 రెట్లు పెరిగి 2 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×